Abn logo
Sep 21 2020 @ 08:47AM

23, 24లలో ఢిల్లీకి భారీవర్ష సూచన... తమిళనాడుకు వరద హెచ్చరిక!

Kaakateeya

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయి. కేరళ, ఒడిశా తదితర రాష్ట్రాలలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఢిల్లీ-ఎన్సీఆర్, బీహార్, పంజాబ్ రాష్ట్రాలలో వేడి వాతావరణంతో ప్రజలు అవస్థల పాలవుతున్నారు. ఈ రాష్ట్రాల్లో త్వరలో వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది. కేరళలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిసిన నేపధ్యంలో రాష్ట్రంలోని 8 జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 


ఒడిశా, ఉత్తరాఖండ్‌లలోని పలు జిల్లాలలో కూడా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరించింది. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో ఈనెల 23, 24 తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా తమిళనాడులోని పిల్లూర్ డ్యామ్ నుంచి వరద నీటిని విడుదల చేసిన నేపధ్యంలో మెట్టుపలాయంతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగం హెచ్చరించింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది.

Advertisement
Advertisement