బదిలీ దరఖాస్తుల ఉపసంహరణకు అవకాశం

ABN , First Publish Date - 2020-11-29T05:36:29+05:30 IST

బదిలీ కోసం దరఖా స్తు చేసుకున్న ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ దరఖాస్తులను ఉపసంహరించుకొనేందుకు పాఠ శాల విద్యాశాఖ అవకాశం కల్పించింది.

బదిలీ దరఖాస్తుల ఉపసంహరణకు అవకాశం




ఒంగోలువిద్య, నవంబరు 28 :  బదిలీ కోసం దరఖా స్తు చేసుకున్న ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ దరఖాస్తులను ఉపసంహరించుకొనేందుకు పాఠ శాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. తొలుత ఐదు విద్యాసంత్సరాలు ఒకే స్కూలులో  పూర్తిచేసిన హెచ్‌ఎం లందరూ బదిలీ కావా ల్సిందేనని ప్రభుత్వం చెప్పింది. దీంతో వారు బదలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఐదు సంవత్సరాలు పూర్తయిన వారు తప్పని సరిగా బదిలీ కావాలని సవరణ ఉత్తర్వులు ఇవ్వడంతో కొందరిపై వేటు తప్పింది. దీంతో హెచ్‌ఎంలు తమ దరఖాస్తులను ఉపసంహరించుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే స్పౌజ్‌, ప్రిఫషియల్‌ కేటగి రీలను తీసువేయించుకొనేందుకు కూడా డీఈవో లాగి న్‌లో అవకాశం కల్పించారు.


Updated Date - 2020-11-29T05:36:29+05:30 IST