నిబద్ధతకు నిలువెత్తు చాన్స్‌

ABN , First Publish Date - 2020-10-20T06:47:04+05:30 IST

తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన రెండు పదవు లు జిల్లాకు వరించాయి. పార్టీ విధాన

నిబద్ధతకు నిలువెత్తు చాన్స్‌

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా పితాని

జాతీయ ప్రధాన కార్యదర్శిగా నిమ్మల

సామాజిక వర్గాల వారీగా సమతుల్యత

కేడర్‌లోనూ వెల్లివిరిసిన సంతోషం

(ఏలూరు-ఆంరఽధజ్యోతి): 

తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన రెండు పదవు లు జిల్లాకు వరించాయి. పార్టీ విధాన నిర్ణయాలను తీసుకు నే పొలిట్‌ బ్యూరోలోకి సీనియర్‌ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు స్థానం దక్కింది. పార్టీలో అత్యంత ఉత్సా హంగా జగన్‌ సర్కార్‌ను ఎండకట్టడంలో అత్యంత వేగంగా స్పందిస్తున్న నిమ్మల రామానాయుడుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్థానం కల్పించారు. వీరి ఎంపికలో సుదీ ర్ఘ కసరత్తే జరిగింది.


సామాజికవర్గాల వారీగా బేరీజు వేసిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఈ నియామకాలను చేపట్టారు. ఇప్పటికే పలువురు సీఎంల వద్ద మంత్రిగా రాణించిన పితాని రాజకీయ వ్యవహారాలు, ప్రభుత్వ విధానాలు, సున్నిత అంశాల్లో దీటుగా వ్యవహరి స్తారని పేరు తెచ్చుకున్నారు. సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొ న్నప్పుడు వాటిని ఎలా అధిగమించాలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయా ముఖ్యమంత్రులను మార్గదర్శకం చేశారు.


బీసీ నేతగా ఒకవైపు ఆయా వర్గాలకు చేరువుగా, సన్నిహితుడుగా మెలుగు తూనే మిగతా వర్గాలను కలుపుకుపోవడంలో రాజకీయ పరి ణతి ప్రదర్శించేవారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పితానిని తమ పక్షాన చేర్చుకునేందుకు అప్పట్లో వైసీపీ అనేక ఎత్తుగడలు వేసినప్పటికీ ఆయన ఏ మాత్రం తలొగ్గకుండా పార్టీకే కట్టుబడి వ్యవహరించారు. వివాదరహితుడుగా ఉన్న బీసీ అగ్రనాయకుడు పితానికి పొలిట్‌బ్యూరోలో అవకాశం ఇవ్వడంపై పార్టీలోనూ హర్షం వ్యక్తమవుతోంది. ఈ మధ్య కాలంలో జిల్లాలో నాయకత్వ పగ్గాలు చేపట్టాల్సిందిగా అఽధి ష్టానం సూచించినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించా రు.


పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు పొలిట్‌ బ్యూరోలో అవకాశం వస్తుందని ముందుగా ఊహించినప్పటికీ అది పితానికి దక్కింది. దీనికి బదులుగా టీడీపీ జాతీయ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా  నిమ్మలను ఎంపిక చేశారు. లోకేశ్‌ సైతం జాతీయ ప్రధాన కార్యదర్శిగానే ఉన్నారు. ఈ తరుణంలో మొదటి నుంచి పార్టీకి అత్యంత విధేయుడిగా, క్రమశిక్షణ కలిగిన నేతగా పేరు గడించడంతోపాటు చురుగ్గా వ్యవహరించే రామానాయుడు అసెంబ్లీలో ఉపనాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు మరోమారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం.. ఆయన నిబ ద్ధతకు నిదర్శనం. బీసీ, కాపు సామాజిక వర్గాల నుంచి వీరిని ఎంపిక చేయడం పార్టీకి కలిసొచ్చే అంశమని సీనియర్లు భావిస్తున్నారు.

సీనియర్లకు, జూనియర్లకు మధ్య సమతు ల్యం పాటిస్తూ తీసుకున్న నిర్ణయాలను టీడీపీ క్యాడర్‌ స్వాగతిస్తోంది. తమకు లభించిన ఈ అవకాశంతో పార్టీ మరింత బలపడేలా శ్రమిస్తామని పితాని సత్యనారాయణ, నిమ్మల స్పష్టం చేశారు.  


Updated Date - 2020-10-20T06:47:04+05:30 IST