Jun 23 2021 @ 09:36AM

కృతి సనన్‌కి 'కిల్ బిల్' రీమేక్‌లో ఛాన్స్..?

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్‌కి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ 'కిల్ బిల్' హిందీ రీమేక్‌లో ఛాన్స్ దక్కినట్టు బీ టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ క్లాసిక్స్‌లో క్వాంటిన్ టరంటినో దర్శకత్వంలో వచ్చిన 'కిల్ బిల్' టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఉమ తుర్మన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2003లో, 2004లో రెండు భాగాలుగా విడుదలై, అకాడమీ అవార్డులకు ఎంపికైంది. బెస్ట్ రివెంజ్ అండ్ యాక్షన్ డ్రామాగా 'కిల్ బిల్' సినిమాకి ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. చిత్ర రీమేక్ హక్కులను నిఖిల్ ద్వివేది దక్కించుకున్నారు. కాగా లాక్ డౌన్ సమయంలో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నిఖిల్ ద్వివేది 'కిల్ బిల్' స్క్రిప్ట్‌ని బాలీవుడ్ ప్రేక్షకులకు తగ్గట్టు రెడీ చేసుకున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్.. అలాగే నటీ, నటుల ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మేకర్స్ కృతి సనన్‌ని సంప్రదించారట. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.  

Bollywoodమరిన్ని...