ఆచార్య చాణక్యుడు తన అనుభవాలను ప్రజలకు తెలియజేశారు. చాణక్య నీతిని అనుసరించడం జీవితంలో విజయానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. అనేక ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. సమాజంలో కొందరు ఇతరులను వేధించడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటివారి భవిష్యత్ ఎలా ఉంటుందో ఆచార్య చాణక్య తెలిపారు. అనునిత్యం ఇతరులను వేధించే అవకాశం కోసం వెదికేవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం కురవదు.
వారి దగ్గరున్న సంపద ఆవిరైపోతుంది. చాణక్య నీతి ప్రకారం కష్టపడి పనిచేస్తూ, స్వశక్తితో మంచి స్థానాన్ని సాధించే సామర్థ్యం ఉన్నవారిని ఎప్పుడూ వేధించకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమవుతాడు. అలాంటివారు ధనాన్ని త్వరగా కోల్పోవలసి వస్తుంది. డబ్బు లేదా అధికార అహంకారంతో పేదవారిని లేదా బలహీనులను వేధించే వారు మరింతగా ఇబ్బందుల బారిన పడటానికి ఎక్కువ సమయం పట్టదు. జీవితంలో ఆర్థిక సమస్యలు తాండవిస్తాయి. ఎవరైనా సరే స్త్రీలను, పిల్లలను గౌరవించాలని ఆచార్య చాణక్య తెలిపారు. వారిని వేధించడం, తృణీకరించడం చేస్తే అలాంటివారు త్వరగా ఇబ్బందుల బారిన పడతారని చాణక్య తెలిపారు.