చాణక్యనీతి: ఇటువంటివారు దొరికితే.. కష్టాలు క్షణాల్లో మాయం!

ABN , First Publish Date - 2022-05-16T13:04:21+05:30 IST

చాణక్యనీతి: ఇటువంటివారు దొరికితే.. కష్టాలు క్షణాల్లో మాయం!

చాణక్యనీతి: ఇటువంటివారు దొరికితే.. కష్టాలు క్షణాల్లో మాయం!

ఆచార్య చాణక్యుడి విధానాలు సమాజంలో తెలివిగా ఎలా మెలగాలో నేర్పుతాయి. ఆచార్య చాణక్యుడు డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, జీవితంలో విజయానికి సంబంధించిన అన్ని విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆచార్య చాణక్యుడు బోధించిన నీతి ఆపద సమయంలో వ్యక్తికి ఎల్లప్పుడూ సరైన సలహా ఇస్తుంది. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కొందరి గురించి తెలిపారు. వారు మనిషికి కష్ట సమయాల్లో పోరాడే శక్తిని అందిస్తారని తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

అండగా నిలబడే కుమారుడు

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రులను చక్కగా చూసుకునే కుమారుడు కలిగిన వ్యక్తి తన లక్ష్యాన్ని సాధిస్తాడు. అతను తన కుటుంబం గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం ఏర్పడదు. అలాంటి కుమారుడు రాబోయే కాలంలో తన తల్లిదండ్రులకు పేరు తెస్తాడు. కుటుంబంతో పాటు సమాజానికి వెలుగునిస్తాడు. అలాంటి కుమారుడు కలిగిన వ్యక్తి జీవితం ఆనందంగా సాగిపోతుందని ఆచార్య చాణక్య తెలిపారు.


భార్య సహకారం

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం  ఎవరి భార్య  సద్గుణాలు కలిగి, సంస్కారవంతురాలై ఉంటుందో అతని జీవితం ఆనందంగా గడిచిపోతుంది. అలాంటి భార్య.. భర్తకు ఎదురయ్యే ప్రతి సుఖంలోను, దుఃఖంలోను తోడుగా నిలుస్తుంది. కష్ట కాలంలో భర్త ముందు కవచంలా నిలుస్తుంది. అలాంటి భార్య మద్దతు లభించిన వ్యక్తి విజయాల మెట్లు ఎక్కుతాడు.

స్నేహితుల సాహచర్యం

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి విజయంలో, వైఫల్యంలో అతని స్నేహితులు పాత్ర తప్పకుండా ఉంటుంది. చాలా మంది తప్పు, ఒప్పుల మధ్య తేడాను గుర్తించలేక తమ జీవితాన్ని వృథా చేసుకుంటారు. చెడు స్వభావం లేదా ఇతరులకు హాని కలిగించే వ్యక్తితో స్నేహం చేస్తే అది భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతుంది. అందుకే సద్గుణాలు కలిగినవారినే స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలని ఆచార్య చాణక్య సూచించారు. 

Updated Date - 2022-05-16T13:04:21+05:30 IST