చాణక్య నీతి: ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి.. లేదంటే అనారోగ్యం పాలవుతారు!

ABN , First Publish Date - 2021-12-12T12:17:26+05:30 IST

మనిషి తన జీవితంలో ఈ పనులు చేసిన..

చాణక్య నీతి: ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి.. లేదంటే అనారోగ్యం పాలవుతారు!

మనిషి తన జీవితంలో ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలని ఆచార్య చాణక్య సూచించారు. హిందూ సంస్కృతి ప్రకారం.. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ ధర్మాన్ని నమ్మేవారు రోజుకు మూడుసార్లు స్నానం చేయాలి. మొదటిది ఉదయం 4:30 నుంచి 5 గంటల మధ్య, రెండవది మధ్యాహ్నం, మూడవది సాయంత్రం 6 గంటలకు. హిందూధర్మంలో ఆడామగ అనే తేడా లేకుండా అందరూ పరిశుభ్రత కోసం కాళ్లు, చేతులు కడుక్కోవాలనే నియమం ఉంది. ఎవరైనా సరే బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు, ఆహారం తినే ముందు, తిన్న తరువాత చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా చేయడం వలన అనారోగ్యం వాటిల్లదని ఆచార్య చాణక్య తెలిపారు.


చాణక్యుడు బ్రాహ్మణ తరగతిలో జన్మించిన ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పండితులలో ఒకరు. మనిషి తన జీవితంలో ఈ 4 పనులు చేసిన తర్వాత తనను తాను పరిశుభ్రపరచుకోవాలని చాణక్య సూచించారు. క్రమం తప్పకుండా స్నానం చేయాలని, అలా చేయని పక్షంలో ఆనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుందని ఆచార్య చాణక్య హెచ్చరించారు. మన ఆరోగ్యం మనం తినే ఆహారం, మనం జీవించే విధానాలను అనుసరించి ఉంటుదని చాణక్య తెలిపారు. మనం చేతులు, కాళ్ళు కడుక్కోవడం ద్వారా కూడా అనేక వ్యాధులను తరిమికొట్టవచ్చని చాణక్య తెలిపారు. అదేవిధంగా మనిషి ఈ 4 పరిస్థితులలో కూడా స్నానం చేయాల్సివుంటుందని చాణక్య తెలిపారు. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ఎవరిదైనా అంత్యక్రియలకు హాజరైన వ్యక్తి తన ఇంటిలోకి వచ్చేముందు తప్పనిసరిగా స్నానం చేయాలి, ఎందుకంటే మనిషి మరణం తర్వాత అతని శరీరం సూక్ష్మక్రిములతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మృతదేహాన్ని తాకినప్పుడు ఇతరులకు అనారోగ్యం వాటిల్లే ప్రమాదం ఉంటుందనే సందేహాలున్నాయి. అంత్యక్రియలకు హాజరైన వ్యక్తి తన ఇంటిలోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా స్నానం చేయాలని ఆచార్య చాణక్య సలహా ఇచ్చారు.


ఇదేవిధంగా లైంగిక సంపర్కం తర్వాత ఆ జంట అపవిత్రంగా మారుతుందని అటువంటి సందర్భంలోనూ ఆ జంట తప్పనిసరిగా స్నానం చేయాలని చాణక్య సూచించారు. పరిశుభ్రతతోపాటు ఆరోగ్యరీత్యా కూడా స్నానం ఎంతో మంచిదని చాణక్య తెలిపారు. ఆరోగ్యకరమైన శరీరం, మెరిసే చర్మం కోసం వారానికి ఒకసారి శరీరానికి మసాజ్ చేయాలని చాణక్య సూచించారు. ఇటువంటి సందర్భాల్లో శరీరానికి నూనెను పూయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఇటువంటప్పుడు శరీరంలోని మురికి బయటకు వస్తుంది. అందుకే మసాజ్ చేసిన తర్వాత కాసేపు ఆగి తలస్నానం చేయాలని చాణక్య సూచించారు. ఇదేవిధంగా క్షవరం (హెయిర్‌కట్) తర్వాత కూడా స్నానం చేయాలని చాణక్య సూచించారు. లేకపోతే వెంట్రుకలు శరీరంలో అక్కడక్కడా అతుక్కుపోయి అనారోగ్యం వాటిల్లేలా చేస్తాయని చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-12-12T12:17:26+05:30 IST