చాణ‌క్య‌నీతి: మ‌గువ‌ల‌ అందాన్ని మెచ్చుకునే మ‌గ‌వారు.. వారిలోని ఈ ల‌క్ష‌ణాల‌ను తెగ అస‌హ్యించుకుంటారు.. అవేమిటో తెలుసా?

ABN , First Publish Date - 2021-10-28T12:04:29+05:30 IST

ఆచార్య చాణక్య‌ స్త్రీల ల‌క్ష‌ణాల‌కు సంబంధించిన‌..

చాణ‌క్య‌నీతి: మ‌గువ‌ల‌ అందాన్ని మెచ్చుకునే మ‌గ‌వారు..  వారిలోని ఈ ల‌క్ష‌ణాల‌ను తెగ అస‌హ్యించుకుంటారు.. అవేమిటో తెలుసా?

ఆచార్య చాణక్య‌ స్త్రీల ల‌క్ష‌ణాల‌కు సంబంధించిన‌ కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియ‌జేశారు. చాణ‌క్య తెలిపిన వివ‌రాల ప్రకారం.. ప్రతి మనిషిలో కొన్ని మంచి, మ‌రికొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. ఒక మ‌నిషిలో ఎన్ని దుర్మార్గ‌పు ల‌క్ష‌ణాలు ఉన్నప్పటికీ.. ఇతరులలో ఒక్క చెడ్డగుణ‌మున్నా దానిని అత‌డు ఏమాత్రం సహించలేడు. ఇక స్త్రీల విష‌యానికొస్తే.. వారికి ఉండే ఈ మూడు అల‌వాట్ల‌ను ఏ పురుషుడు కూడా ఎంత‌మాత్రం సహించ‌లేడు. పైగా అస‌హ్యించుకుంటాడు. ముఖ్యంగా భ‌ర్త త‌న భార్య‌లో ఇటువంటి ల‌క్ష‌ణాలుంటే ఎంత‌మాత్రం త‌ట్టుకోలేడు. ఈ విష‌య‌మై భార్యాభ‌ర్త‌లు త‌ర‌చూ గొడ‌వ ప‌డుతుంటారు. భార్య‌లో భ‌ర్త ఎంత‌మాత్రం ఇష్ట‌ప‌డ‌ని ఆ ల‌క్ష‌ణాలేమిటో.. ఆచార్య చాణ‌క్య వాటి గురించి ఏమ‌న్నారో ఇప్పుడు చూద్దాం..


త‌న భార్య ప‌రాయి పురుషునితో మాట్లాడటాన్ని ఏ భ‌ర్త కూడా స‌హించ‌లేడు. దీనిని చాలా చెడ్డ అలవాటుగా పురుషుడు భావిస్తాడు. మనసులో ఎటువంటి తప్పుడు ఆలోచ‌న లేకపోయినా భ‌ర్త.. త‌న భార్య ప‌రాయి పురుషునితో మాట్లాడ‌టాన్ని ఎంత‌మాత్రం స‌హించలేడు. కొంద‌రు మ‌హిళ‌లు అయిన‌దానికీ.. కానిదానికీ త‌ర‌చూ కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. పైగా ఇలా ప్ర‌వ‌ర్తిస్తే భ‌ర్త ఏమ‌నుకుంటాడోన‌ని వారు కొంచెం కూడా అనుకోరు. మ‌హిళ‌ల‌కు ఉండే ఈ అల‌వాటును పురుషులు ఎంత‌మాత్రం స‌హించ‌లేరు. వెన్నుపోటు పొడిచే ల‌క్ష‌ణం క‌లిగిన మ‌హిళ‌ల‌ను ఏ పురుషుడూ అస్స‌లు స‌హించలేడు. వెన్నుపోటు పొడ‌వ‌డం అనేది చాలా చెడు ల‌క్ష‌ణమని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-10-28T12:04:29+05:30 IST