చాణక్య నీతి: అందరి చేతా ఛీఛీ అనిపించుకునే ఈ గుణాలు మీలో ఉన్నాయా? వాటిని వదిలించుకుని ఇలా శభాష్ అనిపించుకోండి!

ABN , First Publish Date - 2021-11-20T12:12:33+05:30 IST

చాణక్య నీతి జీవితంలో విజయం సాధించడానికి స్ఫూర్తినిస్తుంది.

చాణక్య నీతి: అందరి చేతా ఛీఛీ అనిపించుకునే ఈ గుణాలు మీలో ఉన్నాయా? వాటిని వదిలించుకుని ఇలా శభాష్ అనిపించుకోండి!

చాణక్య నీతి జీవితంలో విజయం సాధించడానికి స్ఫూర్తినిస్తుంది. చాణక్య నీతి ఒక వ్యక్తికి మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని కూడా చెబుతుంది. భారతదేశంలోని అత్యుత్తమ పండితులలో చాణక్యుడు ఒకనిగా గుర్తింపు పొందాడు. చాణక్యుని ఆచార్య చాణక్యుడు అని కూడా అంటారు. చాణక్యుడు నాటి కాలంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తక్షశిల విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు. చాణక్యుడు విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేవాడు. ఆచార్య చాణక్య ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, దౌత్యం, సామాజిక శాస్త్రం మొదలైన వాటిలో పండితుడు. ఒక వ్యక్తి మానసిక ఒత్తిడి, వివాదాలకు దూరంగా ఉన్నప్పుడు, అతని విజయావకాశాలు చాలా వరకు పెరుగుతాయని చాణక్యుడు తన జ్ఞానం, అనుభవాల ద్వారా కనుగొన్నాడు. చాణక్య నీతి ప్రకారం మానసిక ఒత్తిడి, వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తులు తమ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. మనసులోని ఉద్రిక్తత, వివాదాలకు కారణమయ్యే గుణాలను నివారించడానికి, చాణక్యుడు కొన్ని కీలక విషయాలు చెప్పాడు. మీరు వాటిని జీవితంలో అమలు చేస్తే అన్ని పరిస్థితుల్లోనూ విజయం సాధించగలుతారు. 


ఎప్పుడూ అత్యాశకు లోనుకావద్దు 

దురాశకు దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. అత్యాశ కారణంగానే వ్యక్తి అమితమైన స్వార్థపరుడవుతాడు, తప్పుడు దారిలో తిరుగుతాడు. అత్యాశ ఒత్తిడికి అతి పెద్ద కారణం. అత్యాశగల వ్యక్తి ఎప్పుడూ సంతృప్తి చెందడు. అన్నింటిలో అధికంగా ఏదో పొందాలనే కోరిక అతనిని ఒత్తిడి వైపు నెట్టివేస్తుంది. అనేక వ్యాధులకు ఒత్తిడి కూడా ఒక కారణంమే.. అందుకే జీవితాన్ని విలువైనదిగా గ్రహించి, ఒత్తిడికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

కోపం తెచ్చుకోవద్దు 

కోపం వివాదాలకు కారణమవుతుందని చాణక్య నీతి చెబుతోంది. కోపంగా ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. మనలోని మంచి లక్షణాలను కోపం హరించివేస్తుంది. అందుకే కోపానికి దూరంగా ఉండాలి. 

అహంకారానికి దూరంగా ఉండండి

అహంకారానికి దూరంగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. కోపానికి వ్యక్తి ప్రతిభను దెబ్బతీసే లక్షణం ఉంది. కోపంతో ప్రగల్భాలు పలికే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. కోపం మానసిక ఒత్తిడి, అహంకారం మొదలైనవన్నీ విజయానికి ఆటంకాలుగా మారుతాయి. మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే వీటికి దూరంగా ఉండటం తప్పనిసరి.

Updated Date - 2021-11-20T12:12:33+05:30 IST