చాణక్య నీతి: మగువలలో అస్సలు ఉండకూడని రెండు లక్షణాలు.. ఇటువంటివారి సహవాసం తోటివారికి నరకమే!

ABN , First Publish Date - 2021-11-23T12:11:51+05:30 IST

ఆచార్య చాణక్యుడు చరిత్రలో పేర్కొన్న మేధావులలో..

చాణక్య నీతి: మగువలలో అస్సలు ఉండకూడని రెండు లక్షణాలు.. ఇటువంటివారి సహవాసం తోటివారికి నరకమే!

ఆచార్య చాణక్యుడు చరిత్రలో పేర్కొన్న మేధావులలో ఒకరిగా గుర్తింపు పొందారు. చాణక్యునికి తాత్విక, ఆర్థిక, రాజకీయ, సామాజిక విషయాలపై లోతైన అవగాహన ఉందని చరిత్ర ద్వారా వెల్లడయ్యింది. ఆచార్య చాణక్య స్త్రీ ద్వేషి అనే భావన చాలా మందిలో ఉంది. కానీ ఇది నిజం కాదు. స్త్రీలలో ఉండే కొన్ని లక్షణాలు అతనికి నచ్చలేదు. ఆచార్య చాణక్య.. అశోక చక్రవర్తి తల్లిని ఉత్తమ స్త్రీలలో ఒకరిగా భావించాడని చరిత్ర చెబుతోంది. అయితే ఈ రెండు గుణాలు కలిగిన స్త్రీలను దూరంగా ఉంచాలని చాణక్య నీతి చెబుతోంది. 


అత్యాశగల స్త్రీ: 

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం అత్యాశ కలిగిన స్త్రీలు కేవలం తమ స్వప్రయోజనాలను మాత్రమే చూసుకుంటారని, మరొక ఆలోచన చేయరని చెప్పారు. ఇలాంటి స్వభావం కలిగిన స్త్రీలు తమ స్వార్థం తరువాతనే తమ పిల్లల గురించి ఆలోచించే నైజం కలిగివుంటారని చాణక్య తెలిపారు. ఇలాంటి స్త్రీలకు దూరంగా ఉండటం ఉత్తమమని చాణక్య సూచించారు. అత్యాశ కలిగిన స్త్రీలు తమ స్వప్రయోజనాల కోసం అబద్ధాలను ఆశ్రయించడానికి కూడా వెనుకాడరు. ఇటువంటి గుణం కలిగిన మహిళలు ఎప్పుడైనా తోటివారికి ద్రోహం చేయవచ్చని చాణక్య హెచ్చరించారు. మీకు వీలైతే అటువంటి మహిళల వైఖరి మార్చేందుకు ప్రయత్నించాలని చాణక్య తెలియజేశారు.

బద్ధకం కలిగిన స్త్రీ:

బద్ధకం కలిగిన స్త్రీలను భాగస్వామిగా చేసుకోకూడదని ఆచార్య చాణక్యుడు తెలిపారు. ఎందుకంటే అలాంటి స్త్రీలలోని బద్ధకం అనే లక్షణం అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. ఇటువంటివారితో జీవితం ఎంత దారుణంగా ఉంటుందంటే తమతోటి వారిని కూడా బద్ధకస్తులుగా మారుస్తారని చాణక్య తెలిపారు. బద్దకం కలిగిన ఆడవారికి క్రమశిక్షణ కొరవడుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. ఇటువంటి గుణం కలిగిన మహిళలు చాలా కష్టపడితేగానీ విజయం సాధించలేరని చాణక్య తెలిపారు. వీరితో సన్నిహితంగా మెలిగేవారు కూడా కాలంతో పాటు బద్ధకస్తులుగా మారి విజయపథం నుంచి తప్పుకుంటారని చాణక్య హెచ్చరించారు. ఇటువంటి గుణం కలిగిన మహిళలు తమ కుటుంబాన్ని కూడా సరిగ్గా చూసుకోలేకపోతారని చాణక్య అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-11-23T12:11:51+05:30 IST