చాణక్య నీతి: అలాంటి వారు ఎవరి ప్రేమకూ నోచుకోలేరు.. అందరూ వారిని ద్వేషిస్తారు!

ABN , First Publish Date - 2022-03-20T13:17:18+05:30 IST

మనిషి విజయం సాధించేందుకు, సమాజంలో..

చాణక్య నీతి: అలాంటి వారు ఎవరి ప్రేమకూ నోచుకోలేరు.. అందరూ వారిని ద్వేషిస్తారు!

మనిషి విజయం సాధించేందుకు, సమాజంలో ప్రతిష్టను పొందేందుకు నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆచార్య చాణక్యుడు అనేక విషయాలను ప్రస్తావించారు. చాణక్యుడు పలు విధానాల ద్వారా మానవ, సమాజ సంక్షేమం గురించి కూడా చెప్పాడు. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం కొందరు ఎవరి ఆప్యాయత, ప్రేమకు అర్హులు కారు. అలాంటి వారు తమ తీరు తెన్నులను మార్చుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు.


దీనిని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో ఒక శ్లోకం ద్వారా తెలిపారు.. 'అయం నిజః పరో వేతి గణన, లచ్చుచేతసం, ఉద్దార్చరితానాన్ తు వసుధైవ కుటుంబకం'... ఈ శ్లోకార్థం ఏమిటంటే విశాల హృదయం కలిగినవారికి ఈ భూమి మొత్తం ఒక కుటుంబం లాంటిది. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి అందరి ప్రయోజనం కోసం ఆలోచించాలి. ఎప్పుడూ ఉదార ​​హృదయంతో మెలగాలి. ఎందుకంటే  విశాల హృదయం కలిగినవారితో అందరూ ప్రేమగా మాట్లాడతారు. సమాజంలో గౌరవంతో పాటు అందరి ప్రేమ లభిస్తుంది. ఉదారమైన, పెద్ద మనసున్న వ్యక్తులు దానధర్మాలు చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయరు. అలాంటి వారు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. అందుకే ప్రతీవారు ఎల్లప్పుడూ పెద్ద మనసుతో మెలగాలి. అలాంటివారిని అందరూ ఇష్టపడతారు. వారిని తమ సొంత మనుషులుగా భావిస్తారు. అయితే సంకుచిత హృదయం కలిగినవారు ఏదైనా పని చేసే ముందు దాని ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. అలాంటి వారికి సమాజంలో భిన్నమైన స్థానం లభించడానికి ఇదే కారణం. అలాంటి వారిని ద్వేషంతో చూస్తారు. అంతేకాదు అలాంటి వారు జీవితాంతం ఒంటరిగా గడపాల్సి వస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు.  

Updated Date - 2022-03-20T13:17:18+05:30 IST