చాణక్య నీతి: బంగారం ఎంత వ్యర్థంలో పడినా దానిని వెలికి తీయాల్సిందే.. మీ జీవితంలో కూడా..

ABN , First Publish Date - 2022-02-26T12:00:59+05:30 IST

ఎవరైనా సరే జీవితంలో..

చాణక్య నీతి: బంగారం ఎంత వ్యర్థంలో పడినా దానిని వెలికి తీయాల్సిందే.. మీ జీవితంలో కూడా..

ఎవరైనా సరే జీవితంలో విజయం సాధించాలంటే, కొన్ని విషయాలను మరచిపోకూడదని చాణక్య నీతి చెబుతోంది. చాణక్య నీతి మనిషి విజయానికి స్ఫూర్తినిస్తుంది. ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని ఉత్తమ విద్వాంసులలో ఒకరు. ఆయన మాటలు నేటికీ ఆచరణయుక్తంగా ఉన్నాయి. అందుకే నేటికీ చాలా మంది చాణక్య నీతిని అధ్యయనం చేస్తున్నారు. చాణక్య నీతిలోని కొన్ని విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విషాదప్యామృతం గ్రాహ్యమ్మేధ్యాద్పి కాఞ్చనమ్ ।

రనిచాద్ప్యుత్తమం విద్యానస్త్రీరత్నం దుష్కులద్పి ।

ఈ చాణక్య నీతి శ్లోకం ప్రకారం.. వీలైతే విషం నుండి కూడా అమృతాన్ని తీయాలి. బంగారాన్ని మురికిలో పడేసినా దాన్ని వెలికితీసి, శుభ్రం చేసి ఉపయోగించాలి. హీనమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి నుంచి కూడా అత్యుత్తమ జ్ఞానాన్ని అందుకోవడంలో తప్పులేదు. అదే విధంగా పరువుపోయిన కుటుంబపు ఇంటి ఆడపిల్ల సుగుణాలతో నిండివుండి.. మీకు మంచి మాటల బోధిస్తే.. మీరు దానిని గ్రహించేందుకు వెనుకాడకూడదు.


కస్య దోషః కులేనాస్తి వ్యాధినా  కే న  పీడితా।

వ్యసనం కే న సంప్రాప్తం కస్య సౌఖ్యాం నిరంతరం।।

చాణక్య నీతి.. ఈ ప్రపంచంలో మచ్చ లేనివాడు లేడని, రోగాలు, దుఃఖం అనేవి కూడా లేనివాడు లేడని చెబుతుంది. ఆనందం శాశ్వతంగా ఉండదని బోధిస్తోంది.

సత్కులే యోజయేత్కన్యాం పుత్రం విద్యాసు యోజతేత్।

వ్యసనే యోజయేచ్ఛత్రుం మిత్ర ధర్మే నియోజయేత్।।

చాణక్య నీతిలోని ఈ శ్లోకం ప్రకారం మంచి కుటుంబంలో అమ్మాయిని వివాహం చేసుకోవాలి. కుమారునికి ఉత్తమ విద్యను అందించాలి, శత్రువును కష్టాలు, ఇబ్బందుల్లో ఉంచాలి. స్నేహితులు ధర్మయుక్తమైన కర్మలు చేసేలా చూడాలి. ఈ పనులను చేయగలిగిన వారు విజయాన్ని ఇతరులకూ కూడా అందిస్తారు.

దుర్జనస్య చ సర్పస్య వరం సర్పో న దుర్జనః।

సర్పే దంషతి కాలె తు దుర్జనస్తు పదే పదే।। 

చాణక్య నీతిలోని ఈ శ్లోకం ఏం చెబుతోందంటే.. చెడ్డవాడికి - పాముకి మధ్య ఉన్న ఏకైక తేడా ఏమిటంటే.. పాము తన ప్రాణానికి ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే కాటేస్తుంది. కానీ దుర్మార్గుడు అడుగడుగునా హాని చేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే జాగ్రత్తగా ఉండండి.

Updated Date - 2022-02-26T12:00:59+05:30 IST