చాణక్య నీతి: మీరు ఎంత డబ్బు సంపాదించినా మీ అవసరాలు తీరడంలేదా?.. ఇలా వినియోగిస్తే సమస్యలే ఎదురుకావు!

ABN , First Publish Date - 2021-12-16T12:23:13+05:30 IST

ఆచార్య చాణక్య.. మనిషి జీవితానికి సంబంధించిన..

చాణక్య నీతి: మీరు ఎంత డబ్బు సంపాదించినా మీ అవసరాలు తీరడంలేదా?.. ఇలా వినియోగిస్తే సమస్యలే ఎదురుకావు!

ఆచార్య చాణక్య.. మనిషి జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను తన విధానాలలో తెలియజేశారు.  చాణక్య నీతి అనేది ఆచార్య చాణక్య తెలిపిన జీవన నడవడిక విధాన గ్రంథం, దీనిలో చాణక్య మానవ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను వివరంగా తెలియజేశారు.  మనిషికి జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారాలను అందించారు. ఆచార్య చాణక్య ఈ గ్రంథం ద్వారా తెలియజేసిన విషయాలు ఈనాటికీ ఆచరణయుక్తంగా ఉన్నాయి. ఆచార్య అసాధారణ మేధస్సు విషయంలో సంపన్నుడు మాత్రమే కాదు, అనేక విషయాలపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి. ఆచార్య చాణక్య ఒక మేనేజ్‌మెంట్ గురువు కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఆచార్య.. మనిషి జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి.. తన అభిప్రాయాలను వెల్లడించారు. దానిలో భాగంగానే డబ్బు గురించి కూడా వివరించారు. డబ్బు అనేదే మనిషికి నిజమైన స్నేహితుడని అని చాణక్య నమ్మారు. అందుకే సంపదను కూడబెట్టడం ద్వారా మనిషికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరికైనా వారి జీవితంలో స్నేహితులు, బంధువులు దూరమైనప్పుడు ఆ వ్యక్తి దాచుకున్న డబ్బు మాత్రమే అతనికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఎవరైనా తమ జీవితంలో డబ్బుకు సంబంధించి సమస్యలను ఎదుర్కోకూడదని భావిస్తే, వారు ఆచార్య చాణక్య తెలిపిన సూత్రాలను తప్పక ఆచరించాలి. డబ్బు విషయంలో ఎలా మెలగాలో ఆచార్య చాణక్య తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం డబ్బును ఖర్చు చేసేటప్పుడు బాగా ఆలోచించాలని తెలిపారు. డబ్బును వ్యర్థంగా ఖర్చు చేసే వారి దగ్గర అది ఎక్కువ కాలం నిలవదని తెలిపారు. అందుకే డబ్బును వీలైనంత వరకూ పొదుపు చేయడానికే ప్రాధాన్యతనివ్వాలి. అవసరమైనప్పుడు మాత్రమే డబ్బును ఖర్చు చేయాలి. ఇలా చేయడం ద్వారా జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు తలెత్తవని చాణక్య తెలిపారు. జీవితంలో ఒక లక్ష్యం ఉన్నవారికి దానిని సాధించేందుకు డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుందని చాణక్య తెలిపారు.


అందుకే జీవితంలో ఒక లక్ష్యం ఏర్పరుచుకుని, అందుకు తగిన వ్యూహరచన చేస్తూ శ్రద్ధగా పని చేయాలని చాణక్య సూచించారు. నిజాయితీగా ప్రవర్తిస్తూ, కష్టపడి డబ్బు సంపాదించాలని ఆచార్య చాణక్య సూచించారు. తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు త్వరగా వ్యయం అయిపోతుందని, అటువంటి డబ్బు ఆ వ్యక్తి దగ్గర ఎక్కువ కాలం నిలవదని చాణక్య తెలిపారు. తప్పుడు మార్గంలో డబ్బును సంపాదించే వారు ఏదో ఒకరోజున సమస్యల్లో చిక్కుకుంటారని ఆచార్య హెచ్చరించారు. నిజాయితీతో సంపాదించిన డబ్బు.. దానిని సంపాదించిన వ్యక్తికి తగినవిధంగా ఉపయోగపడుతుందని చాణక్య తెలిపారు. మీరు సంపాదించిన డబ్బు ఎల్లప్పుడూ మీ అధికార పరిధిలోనే ఉండాలని చాణక్య సూచించారు. ఎందుకంటే డబ్బు అనేదే మీ నిజమైన స్నేహితుడు.. అది ఇతరుల ఆధీనంలో ఉన్నప్పుడు మీకు ఉపయోగపడదని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-12-16T12:23:13+05:30 IST