chanakya niti: ఇలాంటివారికి ఎప్పుడూ దూరంగా ఉండండి.. లేదంటే ఆపదలు చుట్టుముడతాయి!

ABN , First Publish Date - 2022-09-25T12:36:44+05:30 IST

మోసపూరిత వ్యక్తులు మనకు అప్పుడప్పుడూ ఎదురవుతుంటారు. మన బలహీనతలు...

chanakya niti: ఇలాంటివారికి ఎప్పుడూ దూరంగా ఉండండి.. లేదంటే ఆపదలు చుట్టుముడతాయి!

మోసపూరిత వ్యక్తులు మనకు అప్పుడప్పుడూ ఎదురవుతుంటారు. మన బలహీనతలు చూసుకుని వీరు తమ అసలు రంగు చూపిస్తారు. ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం చెడు సమయాలలో మాత్రమే మనకు నిజమైన స్నేహితుడు ఎవరో తెలుస్తుంది. ఆపదలు ఎదురైనపుడు నిజమైన స్నేహితుడు మీకు రక్షణ కవచంగా నిలుస్తాడు. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సమాజంలోని మోసగాళ్లను గుర్తించడానికి ఐదు ఉత్తమ మార్గాలు సూచించారు. 

తియ్యగా మాట్లాడేవారు 

చాణక్య నీతి ప్రకారం ఎల్లప్పుడూ మధురంగా మాట్లాడేవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ప్రతిదానికీ వంతపాడే ఇటువంటి ఇటువంటి వ్యక్తులు మిమ్మల్ని దిగజార్చేందుకు కుట్ర చేస్తారు. వారి మధురమైన మాటలు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తాయి. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిదని ఆచార్య చాణక్య సూచించారు. 



తప్పుడు నిర్ణయాలను ప్రోత్సహించేవారు

మీ పురోగతిని చూసి అసూయపడేవారు మీ తప్పుడు నిర్ణయాలకు కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇలాంటి వ్యక్తులు ప్రోత్సహిస్తున్నట్టు నటిస్తూ మీ వీపు మీద తడుముతారు. ఆ తరువాత మీ వెనుక మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ మీకు తప్పుడు మార్గాన్ని ఎంచుకోవాలంటూ సలహా ఇస్తారు. వారిని ఎప్పుడూ గుడ్డిగా నమ్మవద్దని చాణక్య తెలిపారు.

ఇతరులకు చెడు చేసేవారు 

మన మనసులో ప్రత్యేక స్థానం పొందడానికి కొందరు అనవసర ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటువంటివారి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించాలి. ఈరోజు ఎదుటివారికి చెడు చేసే వ్యక్తి రేపు ఇతరుల ముందు నీకు చెడు చేయడని గ్యారెంటీ ఏమిటో ఆలోచించాలి. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండటం ఉత్తమం. 

దాపరికంతో మెలిగేవారు

కొందరి మనసు చదవడం చాలా కష్టం. అలాంటివారు తమ రహస్యాలను ఎవరితోనూ పంచుకోరు. వారు తమ మనసులో ఎదుటివారి విషయంలో మోసపూరిత భావనతో ఉంటారు. అలాంటివారు మీకు చెడు జరిగినప్పుడు దాని నుంచి ఆనందాన్ని పొందుతారు. అలాంటి వారితో టచ్‌లో ఉండటం మీకు హాని కలిగిస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. 

వివక్షాపూరిత ధోరణి 

ఒక వ్యక్తి మీ విషయంలో వివక్షతో ప్రవర్తిస్తున్నట్లయితే మీరు అలాంటి వ్యక్తుల సాంగత్యానికి దూరంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు తమ అతి తెలివితేటలు, అనుభవాలతో మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒక వ్యక్తిని అతని మతం, కులం ఆధారంగా గుర్తించకూడదని, అతని కర్మ ఆధారంగా గుర్తించాలని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-09-25T12:36:44+05:30 IST