చాణక్య నీతి: మీ లక్ష్యాన్ని సులభతరం చేసే అమూల్యమైన సూత్రాలు..

ABN , First Publish Date - 2022-02-03T12:18:04+05:30 IST

క్రమశిక్షణ చాలా ముఖ్యమైనదని ఆచార్య చాణక్య..

చాణక్య నీతి: మీ లక్ష్యాన్ని సులభతరం చేసే అమూల్యమైన సూత్రాలు..

క్రమశిక్షణ చాలా ముఖ్యమైనదని ఆచార్య చాణక్య అభివర్ణించారు.  జీవితంలో క్రమశిక్షణ లేని వ్యక్తి తన ఔన్నత్యాన్ని కూడా దిగజార్చుకుంటాడు.  మీరు నిజంగా విజయం సాధించాలనుకుంటే, ముందుగా క్రమశిక్షణను జీవితంలో భాగం చేసుకోవాలని ఆచార్య చాణక్య సూచించారు. మనిషి అదృష్టం మీద ఆధారపడితే ఏమీ లభించదని, నిజంగా విజయం సాధించాలనుకునేవారు కర్మను నమ్ముకుని, చిత్తశుద్ధితో పని చేయాలని ఆచార్య తెలిపారు. రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదనేది చాణక్య తెలిపిన మరో విజయ సూత్రం.  అయితే ఆలోచించకుండా తొందరపాటుతో నిర్ణయం తీసుకోవాలని దీని అర్థం కాదని చాణక్య తెలిపారు. దేనినైనా మొదట క్షుణ్ణంగా తెలుసుకుని, పరీక్షించి, ఆ తరువాతనే నిర్ణయం తీసుకోవాలని ఆచార్య చాణక్య సూచించారు.  


నిర్ణయం తీసుకునే ముందు, దాని ఫలితాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని, తద్వారా మీరు ఆశించిన ఫలితం పొందకపోయినా, మీరు చింతించాల్సిన అవసరం ఉండదని ఆచార్యులు తెలిపారు. మీరు మీ జీవితంలో భారీ లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించాలనుకుంటే, మీతో పాటు ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద లక్ష్యాలు ఒంటరిగా సాధించాలనుకోవడం సరికాదు. అటువంటి పరిస్థితిలో మీరు మంచి నాయకునిగా ఎదగాలి. అందరితో కలిసి పని చేయడానికి ముందుకు రావాలి. మీరు ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే.. దానికి ముందుగా.. నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? దాని ఫలితం ఎలా ఉంటుంది?  విజయం సాధిస్తానా? అనే మూడు ప్రశ్నలు వేసుకోవాలి.  వీటికి తగిన సమాధానాలు వస్తేనే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆచార్య చాణక్య సూచించారు.



Updated Date - 2022-02-03T12:18:04+05:30 IST