Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 19 2021 @ 02:43AM

డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌కు చాణక్య అవార్డు

రెండోసారి పురస్కారం అందుకున్న దిలీప్‌ 

హైదరాబాద్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి) : డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ చాణక్య అవార్డు అందుకున్నారు. రాష్ట్రంలో ఐటీ శాఖ పరిధిలోని డిజిటల్‌ మీడియా విభాగంలో వినూత్న విధానాలను అవలంభిస్తున్నందుకు పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌సీఐ) ఈ పురస్కారాన్ని ప్రకటించింది. దిలీప్‌ ఈ పురస్కారాన్ని అందుకోవడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది కూడా పీఆర్‌సీఐ చాణక్య అవార్డును అందజేసింది. శుక్రవారం రాత్రి గోవాలో జరిగిన పీఆర్‌సీఐ జాతీయ సదస్సులో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఈ పురస్కారాన్ని కొణతం దిలీ్‌పకు అందజేశారు. 

Advertisement
Advertisement