చలో హుజూరాబాద్‌

ABN , First Publish Date - 2021-10-19T05:49:33+05:30 IST

ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి జగిత్యాల జిల్లా నాయకులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

చలో హుజూరాబాద్‌


ఉప ఎన్నిక ప్రచారంలో జగిత్యాల నేతల బిజీబీజీ

మంత్రి కొప్పులతో పాటు పలువురు నేతలు బూత్‌ల వారీగా ప్రచారం

 ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన రాజకీయ పక్షాలు

జగిత్యాల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి జగిత్యాల జిల్లా నాయకులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరీంనగర్‌ ఉమ్మ డి జిల్లాకు చెందిన హుజూరాబాద్‌ అసెంబ్లీకి ఉప ఎన్నిక రావడంతో జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు నేతలకు ప్రధాన రాజకీయ పక్షాలు ప్రచార బాధ్యతలను అప్పగించాయి. ఆయా పార్టీల అధిష్టానాల ఆదేశాల మేరకు మంత్రి నుంచి కార్యకర్త వరకు వివిధ స్థాయిల నాయకులు హుజూరాబాద్‌కు తరలివెళ్లి ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో  పాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఇతర నేతలు అధిష్టానం నిర్ధేశించిన హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రాంతాల్లో ప్రధాన ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఉప ఎన్నికలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నీతానై చూసుకుంటూ కార్యకర్తలకు దిశ నిర్ధేశం చేస్తు న్నారు. తాను సైతం పలు ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల నియోజక వర్గాలతో పాటు చొప్పదండి, వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో మునిగి తేలుతున్నారు.


మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రచార బాధ్యతలు...

జగిత్యాల జిల్లాకు చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  కొన్ని రోజులుగా మంత్రి ఈశ్వర్‌ హుజూరాబాద్‌ సెగ్మెంట్‌లో మకాం వేసి వ్యూహ రచన చేయడంతో పాటు ప్రచారం జరుపుతున్నారు. జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రాతినిత్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు సెగ్మెంట్‌కు చెందిన పలువురు నేతలకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణ ప్రచారం బాధ్యతలను అధిష్టా నం అప్పగించింది. జమ్మికుంట పట్టణంలోని 30 వార్డుల టీఆర్‌ఎస్‌ ప్ర చార బాధ్యతలను దర్మపురి నియోజకవర్గానికి చెందిన సుమారు వంద మంది చోటా మోటా నేతలు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా చొప్పదండి ని యోజకవర్గం నుంచి ప్రాతినిత్యం వహిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, పోతారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్‌ అయి ల్నేని సాగర్‌ రావులు హుజూరాబాద్‌ సెగ్మెంట్‌లోని ఇల్లంతకుంట మండ లంలోని ఆరు గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నా రు. జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలను హుజూ రాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో అధిష్టానం దూరంగా ఉంచింది. 


బీజేపీ నుంచి మోరపల్లి సత్యనారాయణ రావు....

బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మోరపల్లి సత్యనారాయణ రావు నేతృత్వంలో జిల్లాకు చెందిన పలువురు నేతలు హుజూరాబాద్‌ ఉప ఎ న్నికల్లో ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజక వర్గంలోని జమ్మికుంట పట్టణం, మండలంలో జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. జమ్మికుంటలోని 12 పో లింగ్‌ బూత్‌లను 3 శక్తి కేంద్రాలుగా విభజించుకొని బీజేపీ ఎన్నికల వ్యూ హంలో దిగింది. ఒక్కో శక్తి కేంద్రానికి ఇన్‌చార్జిలను అప్పగించారు. జగి త్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలకు ఇన్‌ చార్జి బాధ్యతలను అప్పగించారు. కోరుట్ల సెగ్మెంట్‌కు చెందిన బీజేపీ నేత డాక్టర్‌ జెఎన్‌ వెంకట్‌, సాంబారి ప్రభాకర్‌లు ఒక శక్తి కేంద్రానికి ఇన్‌ చార్జిగా, ర్యాగెల్ల సత్యనారాయణ, మధుకర్‌లో మరో శక్తి కేంద్రానికి ఇన్‌చార్జిగా, కన్నం అంజయ్య ఇంకొక శక్తి కేంద్రానికి ఇన్‌చార్జిగా  బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. జిల్లాకు చెందిన సుమారు 150 మంది బీజేపీ నాయకు లు, కార్యకర్తలు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగస్వా మ్యులవుతున్నారు.


కాంగ్రెస్‌ నేతలదీ అదే తీరు...

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అడ్లూ రి లక్ష్మణ్‌కుమార్‌ నేతృత్వంలో హుజూరాబాద్‌ ఎన్నికల్లో జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని హు జూరాబాద్‌ ఎన్నిక క్యాంపేయినర్‌గా అధిష్టానం నియమించింది. హు జూరాబాద్‌ సెగ్మెంట్‌లోని వీణవంక మండల ప్రచార బాధ్యతలను ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి నిర్వర్తిస్తున్నారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హుజూరాబాద్‌ మండల ప్రచార బాధ్యతలను, కోరుట్ల సెగ్మెంట్‌కు చెందిన నర్సింగ్‌ రావు హుజూరాబాద్‌ పట్టణ ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. 

అధిష్టానం ఆదేశాల మేరకే ప్రచారం...

- అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు

హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేర కు జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎ మ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. హుజూ రాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపిస్తాం.

బీజేపీ విజయానికి ప్రచారం

మోరపల్లి సత్యనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు

హుజురాబాద్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్‌ విజ యానికి జిల్లాకు చెందిన పలువురు నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తు న్నారు. హుజూరాబాద్‌ సెగ్మెంట్‌లో అధిష్టానం నిర్ణయించిన ప్రాంతాల్లో జగిత్యాల జిల్లాకు చెందిన కమలనాథులు ప్రచారంలో బిజీబీజీగా ఉన్నారు.


టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం

అయిల్నేని సాగర్‌ రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు

ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యులవుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌లతో పాటు పలువురు నేతలు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.


Updated Date - 2021-10-19T05:49:33+05:30 IST