వేసవిలో చలివేంద్రాలు తప్పనిసరి: సీఐ

ABN , First Publish Date - 2021-04-13T05:51:29+05:30 IST

వేసవికాలంలో పట్టణానికి వచ్చే ప్రజలకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని తహసీల్దార్‌ శ్రీనివాసులు, వనటౌన సీఐ బాలమద్దిలేటిలు అన్నారు.

వేసవిలో చలివేంద్రాలు తప్పనిసరి: సీఐ
చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న సీఐ మద్దిలేటి

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 12: వేసవికాలంలో పట్టణానికి వచ్చే ప్రజలకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని తహసీల్దార్‌ శ్రీనివాసులు, వనటౌన సీఐ బాలమద్దిలేటిలు అన్నారు. సోమవారం సద్గురు శ్రీ యోగినారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం, సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద పరిగి రోడ్డులో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని తహసీల్దార్‌, సీఐలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో మినరల్‌ వాటర్‌తో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దాతలు చలివేంద్రా లు ఏర్పాటు చేయడంవల్ల పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ అనిల్‌కుమార్‌, ఆర్టీసీ జగదీశ్వర్‌, రాము, హరీ, వెంకటేశ, మంజునాథ్‌, లోకేష్‌, సేవాసమితి అధ్యక్షులు రవిశేఖర్‌, కార్యదర్శి రామచంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-13T05:51:29+05:30 IST