చలానా కనిపించదు.. రిజిస్ర్టేషన్లు కదలవు

ABN , First Publish Date - 2021-10-14T04:41:38+05:30 IST

స్టాంపులు.. రిజిస్ర్టేషన్‌ శాఖలో నూతన విధానంతో వివిధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల రిజిస్ర్టేషన్లలో నకిలీ చలానాలా కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజిస్ర్టేషన్లలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం గత నెల 1 నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టింది. రిజిస్ర్టేషన్‌ కోసం సంబంధిత వ్యక్తులు చెల్లించే స్టాంపు డ్యూటీ మొత్తం బ్యాంక్‌లో కట్టి చలానా పొందాలి. తర్వాత ఆ మొత్తం సమగ్ర ఆర్థిక యాజమాన్య విధానం(సీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా జమవుతాయి. ఆ తర్వాత అదే చలానా సబ్‌ రిజిస్ర్టార్‌కు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. దీన్ని పరిశీలించిన అనంతరం రిజిస్ర్టేషన్‌ చేస్తారు. ఈ నూతన విధానంలో సాంకేతిక సమస్యల కారణంగా క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు.

చలానా కనిపించదు.. రిజిస్ర్టేషన్లు కదలవు
ఇచ్ఛాపురం : సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్న క్రయవిక్రయదారులు

- నూతన విధానానికి సాంకేతిక సమస్యలు

- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న క్రయవిక్రయదారులు

- ఇదీ జిల్లా, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో పరిస్థితి

(ఇచ్ఛాపురం)

స్టాంపులు.. రిజిస్ర్టేషన్‌ శాఖలో నూతన విధానంతో వివిధ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటీవల రిజిస్ర్టేషన్లలో నకిలీ చలానాలా కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజిస్ర్టేషన్లలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం గత నెల 1 నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టింది. రిజిస్ర్టేషన్‌ కోసం సంబంధిత వ్యక్తులు చెల్లించే స్టాంపు డ్యూటీ మొత్తం బ్యాంక్‌లో కట్టి చలానా పొందాలి. తర్వాత ఆ మొత్తం సమగ్ర ఆర్థిక యాజమాన్య విధానం(సీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా జమవుతాయి. ఆ తర్వాత అదే చలానా సబ్‌ రిజిస్ర్టార్‌కు ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. దీన్ని పరిశీలించిన అనంతరం రిజిస్ర్టేషన్‌ చేస్తారు. ఈ నూతన విధానంలో సాంకేతిక సమస్యల కారణంగా క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో చలానా కనిపించకపోవడంతో సబ్‌రిజిస్ర్టార్లు రిజిస్ర్టేషన్లు చేయడంలేదు. దీంతో వేలాదిమంది క్రయవిక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయంతోపాటు మరో 14 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం 300కు పైగా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. మండల కేంద్రాల్లోని రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఎక్కువ రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో.. రిజిస్ర్టేషన్లు నత్తనడకన సాగుతున్నాయి. కొత్త విధానం ప్రకారం చలానా వివరాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తేనే సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. స్థలం రిజిస్ర్టేషన్‌ కోసం బ్యాంక్‌లో స్టాంప్‌ డ్యూటీ చెల్లించినా... ఆ చలానా సబ్‌రిజిస్ర్టార్‌కు ఆన్‌లైన్‌లో కొన్ని సందర్భాల్లో కనిపించకపోవడంతో రిజిస్ర్టేషన్లు ఆగిపోతున్నాయి. దీంతో రిజిస్ర్టేషన్ల కోసం రోజుల తరబడి వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించి.. రిజిస్ర్టేషన్లు వేగవంతమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 


సమస్య తాత్కాలికమే 

చలానా ఆన్‌లైన్‌లో సబ్‌రిజిస్ర్టార్‌కు కనిపించకపోవడం తాత్కాలిక సమస్య. ప్రారంభంలో సమస్య ఉండేది. కానీ ప్రస్తుతం చాలా వరకు తగ్గింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, రిజిస్ర్టేషన్లు వేగవంతం చేయాలని సబ్‌రిజిస్ర్టార్‌లకు ఆదేశించాం. త్వరలో పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారమవుతుంది.

-సత్యనారాయణ, జిల్లా రిజిస్ర్టార్‌

Updated Date - 2021-10-14T04:41:38+05:30 IST