సాంకేతికతతో కూడిన న్యాయవిద్య అభ్యసించాలి

ABN , First Publish Date - 2021-05-08T05:36:57+05:30 IST

మారుతున్న అవసరాలకు అనుగుణంగా నేటి విద్యార్థులు సాంకేతికతతో కూడిన న్యాయవిద్యను అభ్యసించాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వరర్‌ అన్నారు

సాంకేతికతతో కూడిన న్యాయవిద్య అభ్యసించాలి
మాట్లాడుతున్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌

  సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌


గుంటూరు(విద్య), మే 7: మారుతున్న అవసరాలకు అనుగుణంగా నేటి విద్యార్థులు సాంకేతికతతో కూడిన న్యాయవిద్యను అభ్యసించాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వరర్‌ అన్నారు. వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో శుక్రవారం బీఏ ఎల్‌ఎల్‌బి, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, కోర్సుల తరగతులు ప్రారంభం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ క్రైమ్స్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఇంటిగ్రేటింగ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అభ్యసించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలిపారు. గత 7-8 సంవత్సరాలుగా న్యాయశాస్త్రం అభ్యసించిన వారికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడి అత్యధిక వేతనాలను పొందుతున్నారని తెలిపారు. విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు  రత్తయ్య మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి అన్ని రంగాల్లో ప్రైవేటైజేషన్‌ వైపు వెళ్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయవాదులతో అవసరం ఏర్పడుతుందని తెలిపారు. న్యాయశాస్త్ర నిపుణులకు సమాజంలో గౌరవప్రదమైన డిమాండ్‌ ఉందని తెలిపారు. కార్యక్రమంలో చాన్సలర్‌ కె.రామ్మూర్తినాయుడు, వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్‌ కోనేరు కల్పన, అగ్రికల్చరల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌బాబు, ఆచార్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T05:36:57+05:30 IST