చక్రతీర్థం పూజలు చేస్తున్న అర్చకులు
దిలావర్పూర్, మే 20 : భక్తుల ఇలవేల్పు కాల్వ లక్ష్మినరసింహస్వామి వారికి శుక్రవారం చక్రతీర్థ పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మి నరసింహస్వామివారికి అష్టముఖి కోనేరులో నాగవెల్లి స్నానం చేయించారు. అంతకుముందు నిత్యార్చన, శేష హోమం, పూర్హాహుతి, బలిహరణం పూజలు నిర్వహించారు. చక్రతీర్థం పూజల్లో భక్తులు భారీఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.