ఘనంగా లక్ష్మీనరసింహుని చక్రతీర్థ స్నానం

ABN , First Publish Date - 2021-02-25T04:52:16+05:30 IST

సుబ్బమ్మపేటలో కొలువెన లక్ష్మీ నరసింహస్వామి చక్రతీర్థ స్నానం బుధవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయ పుష్కరిణిలో వేదపండితుల వేదాశీర్వచనాల మధ్య స్వామికి చక్రతీర్థ స్నానం చేయించారు.

ఘనంగా లక్ష్మీనరసింహుని చక్రతీర్థ స్నానం
ఉత్సవమూర్తులకు చక్రతీర్థ స్నానం చేయిస్తున్న అర్చకులు


నందిగాం, ఫిబ్రవరి 24: సుబ్బమ్మపేటలో కొలువెన లక్ష్మీ నరసింహస్వామి చక్రతీర్థ స్నానం బుధవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయ పుష్కరిణిలో వేదపండితుల వేదాశీర్వచనాల మధ్య స్వామికి చక్రతీర్థ స్నానం చేయించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కె.గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బాలసీమకు చెందిన  వేదపండితులు శ్రీనివాసాచార్యులు,  అర్చకుడు కె.రామానుజాచార్యులు ప్రత్యేక పూజలు,  పూర్ణాహుతి తది తర కార్యక్రమాలు నిర్వహించారు. 

 

నేడు కల్యాణం

చిన్నదూగాం (జలుమూరు):  చిన్నదూగాం లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం గురువారం రాత్రి  నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆల య వార్షికోత్సవంలో భాగంగా బుధవారం నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శనివారం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు.

 

Updated Date - 2021-02-25T04:52:16+05:30 IST