చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు

ABN , First Publish Date - 2021-01-24T05:30:00+05:30 IST

వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాటయోధురాలని, ఆమె జీవి తం నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమ ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు.

చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు
పెద్దమల్లారెడ్డిలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

భిక్కనూరు, జనవరి 24: వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాటయోధురాలని, ఆమె జీవి తం నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమ ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. ఆది వారం మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని, రైతువేదిక భవనాన్ని ప్రభుత్వ విప్‌ ప్రారంభించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ రజాకార్ల గుండెల్లో రైలు పరుగెత్తించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ విగ్రహాన్ని గ్రామ గ్రామాన రజక సంఘాల ప్రతినిఽధులు నెలకొల్పడం అభినందనీయమ న్నారు. రజకుల అభివృద్ధికి ప్రభుత్వ ఎంతో కృషి చేస్తుందన్నా రు. రజక ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర అధ్యక్షురాలు కొత్తకొండ లక్ష్మీ ఆధ్వ ర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని, ఈ సమస్య పరిష్కా రానికి తమ వంతు కృషి ఎప్పుడు ఉంటుందన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బీసీలుగా ఉన్నారని అన్నారు. మిగతా రాష్ట్రాల్లోని రజకులను సైతం ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్‌ గంప గోవర్ధన్‌ను రజక సంఘం నాయకులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజే శారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్‌రెడ్డి, జడ్పీటీసీ పద్మ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శేఖర్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నంద రమేష్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ హన్మంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భగవ ంత్‌రెడ్డి, విండో చైర్మన్‌ రాజాగౌడ్‌, సర్పంచ్‌ లక్ష్మీ, ఎంపీటీసీ సాయిగౌడ్‌, మంజుల, డీసీసీబీ డైరెక్టర్లు కిష్టాగౌడ్‌, సిద్ధి రాములు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకు లు, రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T05:30:00+05:30 IST