చాకలి ఐలమ్మకు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-09-27T12:33:26+05:30 IST

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ఆమె చిత్ర పటాలకు

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

ఏసీసీ, సెప్టెంబరు 26 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ఆమె చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంచిర్యాల  ఐబీ చౌరస్తాలో తెలంగాణ రజక రిజర్వేషన్‌ సమితి మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంగం లక్ష్మణ్‌, గౌరవ అధ్యక్షుడు సంగెపు ఎల్లయ్య, నాయకులు సంగెపు సురేష్‌, తాండూరి శంకర్‌, అయిటిపాముల శంకర్‌, నస్పూరి అంకులు, కుమార్‌, శ్రీను, భీమన్న, కట్కూరి శంకర్‌, భీమయ్య, ఎన్‌. శ్రీనివాస్‌, పి. అన్వేష్‌, సిహెచ్‌. శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పట్టణ రజక సంఘం అధ్యక్షుడు మైలారం శ్రీనివాస్‌ మాట్లాడారు. జకులను ఎస్సీ జాబితాలో కలపాలని, ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కారక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తకొంత పోశం, ఉపాధ్యక్షుడు కొల్లూరి రాజం, కోశాధికారి నస్పూర్‌ పోశం, నస్పూర్‌ సతీష్‌, మడక శ్రీనివాస్‌, పోచంపల్లి ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

లక్షేట్టిపేట: చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరిం చుకొని లక్షేట్టిపేట రజక సంఘం నాయకులు శనివారం పాత బస్టాండ్‌ ఆవరణలోని ఆమె విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పోడేటి శ్రీనివాస్‌ గౌడ్‌, కౌన్సిలర్‌ చాతరాజు రాజన్న, మెట్టు కల్యాణి రాజు, ఓరుగంటి శ్రీకాంత్‌  తదితరులు పాల్గొన్నారు. 

జన్నారం: తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శనీయమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ అన్నారు. శనివారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రజక భవనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అనంతరం మండలంలోని దేవుని గూడ గ్రామంలో రైతు ఐక్యవేధిక భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మందమర్రిరూరల్‌: మండలంలోని అందుగులపేటలో చాకలి ఐలమ్మ జయంతిని రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి సందీప్‌, కాంగ్రెస్‌ నాయకుడు కడారి జీవన్‌కుమార్‌, బీట్‌ అధికారి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-27T12:33:26+05:30 IST