Abn logo
Apr 4 2020 @ 11:08AM

చైతన్య రీమేక్ ఆగిందా..?

Kaakateeya

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి జంటగా లవ్‌స్టోరి అనే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చైత‌న్య ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై సినిమా చేయాల్సింది. కానీ.. చైతు సినిమాను హోల్డ్‌లో పెట్టేసి మ‌హేశ్‌తో సినిమా చేయ‌డానికి ప‌రుశురామ్ వెళ్లిపోయాడు. దీంతో విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని సినీ వ‌ర్గాల బోగ‌ట్టా. అయితే హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టించి విజ‌య‌వంత‌మైన చిత్రం ‘బ‌దాయి హో’. ఈ సినిమా తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను దిల్‌రాజు సొంతం చేసుకున్నాడు. దీన్ని చైత‌న్య‌తో రీమేక్ చేయాల‌నుకున్నాడు. అయితే ఇప్పుడు అటు దిల్‌రాజు, ఇటు చైత‌న్య ఈ రీమేక్‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌ని.. సినిమా ఆగిపోయిన‌ట్లేన‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Advertisement
Advertisement
Advertisement