56 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

ABN , First Publish Date - 2020-10-01T08:25:20+05:30 IST

రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నియమించారు. ఈ నియామకాల్లో వైసీపీ ఎమ్మెల్యేల సిఫారసులకే ప్రాధాన్యం లభించింది...

56 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నియమించారు. ఈ నియామకాల్లో వైసీపీ ఎమ్మెల్యేల సిఫారసులకే ప్రాధాన్యం లభించింది. వారు చెప్పినవారికే నామినేటెడ్‌ పదవులు దక్కాలని సీఎం గతంలోనే పార్టీ సీనియర్‌ నేతలకు స్పష్టం చేశారు. ఆ ప్రకారమే చైర్మన్‌ పదవులకు నియామకాలు జరిగాయి. 56 మంది చైర్మన్లు/చైర్‌పర్సన్లు వీరే..


కురుబ/కురుమ కార్పొరేషన్‌: కోటి సూర్యప్రకాశ్‌ (అనంతపురం), తొగట/తొగట వీరక్షత్రియ: గడ్డం సునీత (అనంతపురం), కుంచిటిగ వక్కలిగ: గౌడవారి నీలవేణి (అనంతపురం), వన్యకుల క్షత్రియ: కె.వనిత (చిత్తూరు), పాల- ఏకరి: తరిగొండ మురళీధర్‌ (చిత్తూరు), ముదలియార్‌ కార్పొరేషన్‌: తిరుపత్తూర్‌ గోవిందరాజన్‌ సురేశ్‌ (చిత్తూరు), ఈడిగ కార్పొరేషన్‌: కె.శాంతి (తూర్పుగోదావరి), గాండ్ల/తెలికుల: సంకిస భవానీప్రియ (తూర్పుగోదావరి), పెరిక: పురుషోత్తం గంగాభవాని (తూర్పుగోదావరి), అగ్నికుల క్షత్రియ: బందన హరి (తూర్పుగోదావరి), అయ్యరక కార్పొరేషన్‌: ఆవాల రాజేశ్వరి (తూర్పుగోదావరి), షేక్‌/ షెయిక్‌ కార్పొరేషన్‌: షేక్‌ యాసిన్‌ (గుంటూరు), వడ్డెర కార్పొరేషన్‌: దేవళ్ల రేవతి (గుంటూరు), కుమ్మరి శాలివాహన: మండెపూడి పురుషోత్తం (గుంటూరు), కృష్ణబలిజ/పూసల: కోట భవాని (గుంటూరు), యాదవ కార్పొరేషన్‌: నాన్యంపల్లె హరీ్‌షకుమార్‌ (కడప), నాయీబ్రాహ్మణ: శిద్దవటం యానాదయ్య (కడప), పద్మశాలి కార్పొరేషన్‌: జింకా విజయలక్ష్మి (కడప), నూర్‌బాషా/దూదేకుల: అస్పారి ఫరూక్‌బీ (కడప), విశ్వబ్రాహ్మణ: తోలేటి శ్రీకాంత్‌ (కృష్ణా), సాగర/ఉప్పర: కర్నాటి రమాదేవి (కృష్ణా), గౌడ కార్పొరేషన్‌: మాడు శివరామకృష్ణ (కృష్ణా), వడ్డెలు కార్పొరేషన్‌: సైదు గాయత్రీ సంతోష్‌ (కృష్ణా), భట్రాజ కార్పొరేషన్‌: కూరపాటి గీతాంజలీదేవి (కృష్ణా), వాల్మీకి/ బోయ: డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ (కర్నూలు), కుర్ని/కరికలభక్తులు: బుట్టా శారదమ్మ (కర్నూలు), వీరశైవ లింగాయత్‌: వై.రుద్రగౌడ్‌ (కర్నూలు), బెస్త కార్పొరేషన్‌: తెలుగు సుధారాణి (కర్నూలు), ముదిరాజ్‌/ ముత్తరాసి: కోర్న వెంకటనారాయణ ముదిరాజ్‌ (నెల్లూరు), జంగం కార్పొరేషన్‌: వలివేటి ప్రసన్న (నెల్లూరు), బొందిలి కార్పొరేషన్‌: ఎస్‌.కిశోర్‌ సింగ్‌ (నెల్లూరు), ముస్లిం సంచార జాతులు: సయ్యద్‌ హసీఫా (నెల్లూరు), చాత్తాద శ్రీవైష్ణవ కార్పొరేషన్‌: టి.మనోజ్‌ కుమార్‌ (ప్రకాశం), ఆరె కటిక /కటిక: దాదా కుమారలక్ష్మి (ప్రకాశం), దేవాంగ కార్పొరేషన్‌: బీరక సురేంద్రబాబు (ప్రకాశం), మేదర: కేతా లలితానాంచారమ్మ (ప్రకాశం), కాళింగ కార్పొరేషన్‌: పేరాడ తిలక్‌ (శ్రీకాకుళం), కాళింగ కోమటి/ కళింగ వైశ్య: అంధవరపు సూరిబాబు (శ్రీకాకుళం), రెడ్డిక కార్పొరేషన్‌: దుక్కా లోకేశ్వరరావు (శ్రీకాకుళం), పొలినాటి వెలమ: పి.కృష్ణవేణి (శ్రీకాకుళం), కూరాకుల/పొందర: రాజాపు హైమావతి (శ్రీకాకుళం), శ్రీశయన కార్పొరేషన్‌: స్మిత్‌ చీపురు రాణి (శ్రీకాకుళం), మత్స్యకార కార్పొరేషన్‌: కోలా గురువులు (విశాఖ), గవర కార్పొరేషన్‌: బొడ్డెర ప్రసాద్‌ (విశాఖ), నగరాలు కార్పొరేషన్‌: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ), యాత కార్పొరేషన్‌: పిల్లి సుజాత (విశాఖ), నాగవంశం: బుగ్గా లలిత (విశాఖ), రజకకార్పొరేషన్‌: సుగుమంచిపల్లి రంగన్న విశాఖ), తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్‌ (విజయనగరం), కొప్పుల వెలమ: నెక్కల నాయుడుబాబు (విజయనగరం), శిష్టకరణం: కంతిమహంతి అనూషా పట్నాయక్‌ (విజయనగరం), దాసరి కార్పొరేషన్‌: డాక్టర్‌ రంగుముద్రి రమాదేవి (విజయనగరం), సూర్యబలిజ: శెట్టి అనంతలక్ష్మి (పశ్చిమ గోదావరి), శెట్టిబలిజ: డాక్టర్‌ గుబ్బల తమ్మయ్య (పశ్చిమ గోదావరి), అత్యంత వెనుకబడిన తరగతులు: పెండ్ర వీరన్న (పశ్చిమ గోదావరి), అతిరస కార్పొరేషన్‌: ఎయిల భాస్కరరావు (పశ్చిమ గోదావరి)

Updated Date - 2020-10-01T08:25:20+05:30 IST