భగవత్‌ చింతనతోనే మానసిక ప్రశాంతత తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ

ABN , First Publish Date - 2021-02-24T06:13:32+05:30 IST

భగవత్‌ చింతనతోనే మానసిక ప్రశాంతత లభి స్తుందని తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ అన్నారు.

భగవత్‌ చింతనతోనే మానసిక ప్రశాంతత తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ
అనుగ్రహ భాషణం చేస్తున్న తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి

కుంటాల, ఫిబ్రవరి 23 : భగవత్‌ చింతనతోనే మానసిక ప్రశాంతత లభి స్తుందని తోగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ అన్నారు. మంగళవారం జిల్లాలోని కుంటాలలో జరిగిన గజ్జలమ్మ ఆలయ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులనుద్ధేశించి మాట్లాడా రు. నేటి సమాజంలో యువత చెడు వ్యవసనాలకు లోను కావొద్దని.. మ ద్యపానం, ధూమపానం తదితర వ్యసనాలకూ దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిమార్గం వైపు పయనించాలని.. భగవత్‌ చింతనతోనే మానసిక ప్ర శాంతత లభిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తునపాల్గొన్నారు. 

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా : విజయలక్ష్మీ 

గజ్జలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ అ న్నారు. మంగళవారం ఆమె గజ్జలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పలు సమస్యలు వివరించగా.. తన వంతుగా త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

ఫముస్లిం సోదరుడి అన్నదానం 

గజ్జలమ్మ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం కుంటాలకు చెందిన ముస్లిం సోదరుడు ఫహింఖాన్‌ అన్నదానం చేశారు. మతాలకు అతీ తంగా అన్నదానం చేయడం పట్ల పలువురు అతన్ని అభినందించారు.  


Updated Date - 2021-02-24T06:13:32+05:30 IST