జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రంలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. జగిత్యాల చింతకుంట చెరువు వద్ద ఆదివారం నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో జగిత్యాల చైర్ పర్సన్ బోగ శ్రావణి పాల్గొన్నారు. వినాయకులను చెరువులో నిమజ్జనం చేసేందుకు మహిళా కౌన్సిలర్లతో కలిసి నాటు తెప్పపై నిల్చుని చెరువులోకి వెళ్లారు. బరువు ఎక్కువ కావడంతో తెప్ప ఒక వైపు ఒరిగి చైర్ పర్సన్ శ్రావణి నీటిలో పడిపోయారు. అక్కడే ఉన్న గంగపుత్రులు తేరుకుని కాపాడడంతో ప్రమాదం తప్పింది.