ఏపీలో స్మార్ట్ సిటీల చైర్మన్లు రాజీనామా

ABN , First Publish Date - 2022-03-22T22:17:24+05:30 IST

స్మార్ట్ సిటీల నామినేటెడ్ చైర్మన్ల విషయంలో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి

ఏపీలో స్మార్ట్ సిటీల చైర్మన్లు రాజీనామా

అమరావతి: స్మార్ట్ సిటీల నామినేటెడ్ చైర్మన్ల విషయంలో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తిరుపతి, ఏలూరు, విశాఖ, కాకినాడ స్మార్ట్ సిటీల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. విశాఖ స్మార్ట్ సిటీ ఛైర్మన్ జి.వెంకటేశ్వర రావు, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ ఏ.రాజు బాబు, ఏలూరు స్మార్ట్ సిటీ ఛైర్ పర్సన్ బి.అఖిల, తిరుపతి స్మార్ట్ సిటీ ఛైర్ పర్సన్ ఎన్. పద్మజలు తమ పదవులకు రాజీనామా చేశారు. సాంకేతికంగా స్మార్ట్ సిటీ మిషన్లకు నామినేటెడ్ నియామకాలు చెల్లవని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఏపీ ప్రభత్వానికి లేఖ రాసింది. దీంతో తక్షణం రాజీనామాలు చేయించాలని గత డిసెంబర్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ  లేఖ రాసింది.  కేంద్ర ప్రభుత్వ రాసిన లేఖ మేరకు రాష్ట్రంలో స్మార్ట్ సిటీ మిషన్ చైర్మన్లతో ప్రభుత్వం రాజీనామాలు చేయించింది. ఈమేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2022-03-22T22:17:24+05:30 IST