Abn logo
Oct 19 2020 @ 01:34AM

56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు

జాబితా విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్‌..

పాలనలో భాగస్వామ్యం ఉంటుందని వెల్లడి


అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాల కోసం 56 కార్పొరేషన్లను ప్రకటించారు. ఆదివారం బీసీ వర్గానికి చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకరనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణతో కలిసి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌లో కార్పొరేషన్ల జాబితాను  విడుదల చేశారు.


ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలని వైసీపీ అధినేతగా పాదయాత్ర సమయంలోనే సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించినట్టు ఽచెప్పారు. 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్ల జాబితా ప్రకటించే అవకాశం రావడంతో తన జన్మ ధన్యమైందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.  


బీసీ కార్పొరేషన్లు.. చైర్మన్లు..

రజక-సుగుమంచిపల్లి రంగన్న(అనంతపురం), కురుబ/కురుమ-కోటి సూర్యప్రకాశ్‌ బాబు(అనంత), తొగట/తొగట వీరక్షత్రియ-గడ్డం సునీత(అనంత), కుంచిట వక్కలిగ-డాక్టర్‌ బి. నళిని(అనంత), వన్యకుల క్షత్రియ-కె.వనిత(చిత్తూరు), పాల-ఏకరి-తరిగొండ మురళీధర్‌(చిత్తూరు), ముదలియార్‌-తిరుపత్తురు గోవిందరాజన్‌ సురేశ్‌(చిత్తూరు), ఈడిగ-కె.శాంతి(చిత్తూరు), గాండ్ల/తెలికుల-శాంకిస భవానీప్రియ(తూర్పుగోదావరి), పెరిక-పురుషోత్తమ గంగాభవానీ(తూర్పుగోదావరి), అగ్రికుల క్షత్రియ-బందనహరి(తూర్పుగోదావరి), అయ్యారక-ఆవల రాజేశ్వరి(తూర్పుగోదావరి), షేక్‌/షెయిక్‌-షేక్‌ యాసిన్‌(గుంటూరు), వడ్డెర-దేవళ్ల రేవతి(గుంటూరు), కుమ్మరి శాలివాహన-మందెపూడి పురుషోత్తం(గుంటూరు),

కృష్ణ బలిజ/పూసల-కోలా భవానీ(గుంటూరు), యాదవ-నన్యంపల్లి హరీ్‌షకుమార్‌(కడప), నాయీ బ్రాహ్మణ-సిద్దవటం యానాదయ్య(కడప), పద్మశాలి-జింకా విజయలక్ష్మి(కడప), నూర్‌బాషా/దూదేకులు-ఆస్పరి ఫకూరుబి(కడప), సగర/ఉప్పర-గానుగపెంట రమణమ్మ(కడప), విశ్వభ్రాహ్మణ-తోలేటి శ్రీకాంత్‌(కృష్ణా), గౌడ-మాడు శివరామకృష్ణ(కృష్ణా), వద్దేలు-సైదు గాయత్రి సంతోశ్‌(కృష్ణా), భట్రాజ-కూరపాటి గీతాంజలి దేవి(కృష్ణా), వాల్మీకి/బోయ-డాక్టర్‌ ఏ మధుసూధన్‌(కర్నూలు), కుర్మి/కరికాలభక్తులు-బుట్టా శారదమ్మ(కర్నూలు),

వీరశైవ లింగాయత్‌-వై.రుద్రగౌడ్‌(కర్నూలు), బెస్త-తెలుగు సుధారాణి(కర్నూలు), ముదిరాజ్‌/ముత్తరాసి-కోర్న వెంకటనారాయణ ముదిరాజ్‌(నెల్లూరు), జంగం-వలివేటి ప్రసన్న(నెల్లూరు), బొందిలి-ఎస్‌. కిశోర్‌సింగ్‌(నెల్లూరు), ముస్లిం సంచార  జాతులు-సయ్యద్‌ అసిఫా(నెల్లూరు), చత్తాడశ్రీవైష్ణవ-టి. మనోజ్‌కుమార్‌(ప్రకాశం), ఆరె కటిక/కటిక-దాదా కుమార్‌లక్ష్మి(ప్రకాశం), దేవాంగ-బీరక సురేంద్రబాబు(ప్రకాశం), మేదర-కేతా లలిత నాంచారమ్మ(ప్రకాశం), కళింగ-పేరాడ తిలక్‌(శ్రీకాకుళం), కళింగ కోమటి/కళింగ వైశ్య-అందవరపు సూరిబాబు(శ్రీకాకుళం),

రెడ్డిక-దుక్కా లోకేశ్వరరావు(శ్రీకాకుళం), పోలినాటివెలమ-పి. కృష్ణవేణి(శ్రీకాకుళం), కూరాకుల/పొందర-రాజపు హైమావతి(శ్రీకాకుళం), శ్రీశయన-చీపురు రాణి(శ్రీకాకుళం), మత్స్యకార-కోలా గురువులు(విశాఖ), యాత-పి.సుజాత(విశాఖ), గవర-బొద్దెడ ప్రసాద్‌(విశాఖ), నగరాలు-పిల్లా సుజాత(విశాఖ), నాగవంశం-బొడ్డు అప్పలకొండమ్మ(విశాఖ), తూర్పు/గాజుల కాపు-మామిడి శ్రీకాంత్‌(విజయనగరం), కొప్పుల వెలమ-నెక్కల నాయుడుబాబు(విజయనగరం), శిష్టకరణం-కంటిమహంతి అనూష పట్నాయక్‌(విజయనగరం),

దాసరి-డాక్టర్‌ రంగుముద్రి రమాదేవి(విజయనగరం), సూర్య బలిజ-శెట్టి అనంతలక్ష్మి(పశ్చిమగోదావరి), శెట్టిబలిజ-డాక్టర్‌ గుబ్బాల తమ్మయ్య(పశ్చిమగోదావరి), అత్యంత వెనుకబడిన తరగతులు-పెండ్ర వీరన్న(పశ్చిమగోదావరి), అత్తిరస-ఎల్లా భాస్కర్‌రావు(పశ్చిమగోదావరి).


Advertisement
Advertisement
Advertisement