మహిళా పోలీసు వద్ద చైన్‌ స్నాచింగ్‌

ABN , First Publish Date - 2022-06-20T17:53:02+05:30 IST

స్థానిక ఎగ్మూర్‌లో మహిళా పోలీసు వద్ద చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తూత్తుకుడికి చెందిన

మహిళా పోలీసు వద్ద చైన్‌ స్నాచింగ్‌

చెన్నై/పెరంబూర్‌: స్థానిక ఎగ్మూర్‌లో మహిళా పోలీసు వద్ద చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తూత్తుకుడికి చెందిన ఎస్‌.ప్రియ (25) తమిళనాడు ప్రత్యేక పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. పుదుపేట నారాయణన్‌ నాయకన్‌ వీధిలో నివసిస్తున్న ప్రియ శుక్రవారం రాత్రి మరో కానిస్టేబుల్‌ ప్రభాకరన్‌తో కలసి ఎగ్మూర్‌లోని పోలీస్‌ ఆఫీసర్స్‌ మెస్‌ సమీపంలో వెళ్తుండగా ద్విక్రవాహనంపై వచ్చిన ఇద్దరు అగంతకులు ప్రియ మెడలోని నాలుగు సవర్ల నగ లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనపై ఎగ్మూర్‌ పోలీసులు కేసు నమోదుచేసి అగంతకుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-06-20T17:53:02+05:30 IST