చైన్‌ స్నాచింగ్‌లో కవలలు అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-26T07:16:18+05:30 IST

వారిద్దరూ కవలలు.. చెడు వ్యసనా లకు బానిసలయ్యారు. సులువుగా డబ్బు సంపాదించాలని చైన్‌ స్నా చింగ్‌లకు పాల్పడుతూ పోలీసుల చేతికి చిక్కారు.

చైన్‌ స్నాచింగ్‌లో కవలలు అరెస్ట్‌
నిందితుల వివరాలు తెలుపుతున్న అదనపు ఎస్పీ దిలీప్‌కిరణ్‌

 13 కాసుల బంగారు ఆభరణాలు, బైక్‌ స్వాధీనం

ఏలూరు క్రైం, జనవరి 25 : వారిద్దరూ కవలలు.. చెడు వ్యసనా లకు బానిసలయ్యారు. సులువుగా డబ్బు సంపాదించాలని చైన్‌ స్నా చింగ్‌లకు పాల్పడుతూ పోలీసుల చేతికి చిక్కారు. ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద అదనపు ఎస్పీ డాక్టరు ఓ దిలీప్‌కిరణ్‌ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఏలూరు రూరల్‌ మండలం పైడిచింతపాడుకు చెందిన సైదు దుర్గారావుకు జన్మించిన కవలు రాఘవేంద్రప్రసాద్‌, రవీంద్రప్రసాద్‌ చేపల చెరువులపై పనిచేస్తున్నారు. వీరు రాత్రి సమయంలో బైక్‌పై ఏలూరు నగరానికి వచ్చి ఒంటరిగా వున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులు తెంపుకుని వెళ్లిపోతున్నారు. ఏలూరు టుటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నేరాలు, వన్‌టౌన్‌లో ఓ నేరం, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక నేరానికి పాల్పడ్డారు. దీంతో ఎస్‌ఐలు రామకృష్ణ, నాగ బాబులతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఏలూరు కోడేలు ప్రాంతంలో అనుమానాస్పదంగా బైక్‌పై వెళుతున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా నగరంలో ఐదు నేరాలకు పాల్పడినట్టు ఆంగీకరించారు. 13 కాసుల బంగారు ఆభరణాలు రూ.4.85లక్షలు, బైక్‌ను స్వాధీనం చేసుకు న్నారు. వీరు జనవరిలోనే నేరాలు మొదలు పెట్టారని చెప్పారు. నేర స్తులను అ రెస్ట్‌ చేయడంలో హెచ్‌సీ కమలాకర్‌బాబు, కానిస్టేబుళ్లు శ్రీనివాసరెడ్డి, శేషుకుమార్‌, యశ్వంత్‌కుమార్‌ సహకరించారని వీరికి రివార్డులు ఇస్తున్నట్టు తెలిపారు. 


Updated Date - 2022-01-26T07:16:18+05:30 IST