Abn logo
Oct 28 2020 @ 20:25PM

పిల్లల విషయంలో చై, సామ్‌ అలా క్లారిటీ ఇచ్చారా..!

Kaakateeya

టాప్‌ సెలబ్రిటీ కపుల్స్‌లో నాగచైతన్య, సమంత జంట ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. మూడేళ్ల ముందే జంటగా మారిన వీరిద్దరూ తల్లిదండ్రులెప్పుడవుతారా? అనే అందరూ డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే త్వరలోనే వీరు తల్లిదండ్రులు కానున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తూనే ఉంటాయి. అయితే తాజాగా చైతన్య తామిప్పుడే తల్లిదండ్రులు కావాలనుకోవడంలేదంటూ చెప్పకనే చెప్పేశాడు. అది ఎలాగంటారా? ఓ యాడ్‌ రూపంలో..రీసెంట్ గా ఓ కమర్షియల్ యాడ్‌లో  నాగచైతన్య, సమంత కలిసి నటించారు. ఆ సమయంలో సమంత పిల్లల డ్రెస్‌ ఫొటోలు చూపించి వీరు క్యూట్‌గా ఉన్నారనడం.. అలాంటివేం ప్లాన్‌ చేయకని చెప్పడం ద్వారా పరోక్షంగా మరోసారి చైతన్య తమను తల్లిదండ్రులు ఎప్పుడవుతారని ప్రశ్నిస్తున్న వారికి సమాధానమిచ్చేశారు. 


Advertisement
Advertisement