యువ స్పిన్నర్ తల్లిదండ్రులకు కరోనా

ABN , First Publish Date - 2021-05-14T01:33:06+05:30 IST

టీమిండియా యువ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ తల్లిదండ్రులకు కరోనా సోకింది. తండ్రి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని..

యువ స్పిన్నర్ తల్లిదండ్రులకు కరోనా

న్యూఢిల్లీ: టీమిండియా యువ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ తల్లిదండ్రులకు కరోనా సోకింది. తండ్రి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చహల్‌ భార్య ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. చహల్‌ తల్లి స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, చహల్‌ తండ్రికి మాత్రం లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్‌ చేశారని వెల్లడించింది. దీనిపై చాహల్ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

Updated Date - 2021-05-14T01:33:06+05:30 IST