పుష్ప.. పుష్పరాజ్.. అంటూ వచ్చేసిన చాహల్.. ‘కాపీ క్యాట్’ అంటూ బదులిచ్చిన డేవిడ్ వార్నర్

ABN , First Publish Date - 2022-02-10T22:52:33+05:30 IST

‘పుష్ప’.. ఇప్పుడీ పేరు ట్రెండింగ్. యువతలో ఇదో క్రేజ్. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాలోని డైలాగులు, డ్యాన్స్‌లు

పుష్ప.. పుష్పరాజ్.. అంటూ వచ్చేసిన  చాహల్.. ‘కాపీ క్యాట్’ అంటూ బదులిచ్చిన డేవిడ్ వార్నర్

న్యూఢిల్లీ: ‘పుష్ప’.. ఇప్పుడీ పేరు ట్రెండింగ్. యువతలో ఇదో క్రేజ్. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాలోని డైలాగులు, డ్యాన్స్‌లు వైరల్ అయినంతగా మరే సినిమా డైలాగులు వైరల్ కాలేదు. క్రికెటర్లు, పలువురు ప్రముఖులు కూడా తగ్గేదే లేదంటూ పుష్ప సినిమా డైలాగులను ట్రై చేసి మురిసిపోయారు. తాజాగా, టీమిండియా బౌలర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ‘పుష్ప’ను ట్రై చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతడు షేర్ చేసిన రీల్ ఒకటి అభిమానులకు తెగ నచ్చేసింది. 


‘పుష్ప.. పుష్పరాజ్. మే ఝుకేంగ్ నహీ’ అని చెబుతూ అభిమానులను అలరించాడు. నేడు పోస్టు చేసిన ఈ వీడియోకు ఏకంగా 1.7 లక్షల లైకులు, బోల్డన్ని కామెంట్స్ వచ్చాయి. చాహల్ వీడియో చూసిన సోషల్ మీడియా స్టార్, యాంకర్ షెఫాలీ బగ్గా.. ‘సెకండ్ ప్రొఫెషన్-యాక్టర్’ అని కామెంట్ చేస్తూ లాఫింగ్, హార్ట్ సింబల్ ఎమోజీలు జోడించాడు. ‘‘అయితే, మరిప్పుడు బౌలింగ్ ఎవరు చేస్తారు?’’ అని నటుడు అలీ గోనీ  రిప్లై ఇచ్చాడు. ‘పుష్పరాజ్ క్లబ్‌లోకి స్వాగతం’ అని ఓ అభిమాని ఆహ్వానించాడు. 


వీరందరి కంటే ముందు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ ‘పుష్ప’ రీల్స్‌తో ముందుకొచ్చాడు. ‘డీప్‌ఫేక్’ టెక్నాలజీ సాయంతో అల్లు అర్జున్ తల తొలగించి తన తలతో పలు వీడియోలు పోస్టు చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. తాజాగా, చాహల్ వీడియోపై వార్నర్ స్పందిస్తూ ‘కాపీ క్యాట్’ అని రాసుకొచ్చాడు. దీనికి మూడు లాఫింగ్ ఎమోజీలు తగిలించాడు. 


Updated Date - 2022-02-10T22:52:33+05:30 IST