చదువులు సాగేదెలా..?

ABN , First Publish Date - 2021-06-24T04:38:59+05:30 IST

కొవిడ్‌ వైరస్‌ రెండవ ఉధృతి ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి.

చదువులు సాగేదెలా..?

రుణాల ఊబిలో 

మధ్యతరగతి కుటుంబాలు

కొవిడ్‌ కర్ఫ్యూతో

పడిపోయిన ఆదాయాలు

పిల్లల పాఠశాల 

      ఫీజుల కోసం ఆరాటం

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 23 : కొవిడ్‌ వైరస్‌ రెండవ ఉధృతి ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. చాలామంది కరోనాబారిన పడడంతో ప్రైవేటు ఆసుపత్రులలో చేరి లక్షలు చెల్లించి ప్రాణాలు కాపాడుకుని బతుకు జీవుడా అంటూ ఇంటికి చేరుకున్నారు. జూన్‌ నుంచి ఆగస్టు వరకు తల్లిదండ్రులకు సంకటంగా మారింది. పిల్లలను మంచి పాఠశాలు, కళాశాలల్లో చేరించాలని, వారికి మంచి భవిష్యత్‌ ఇవ్వాలని ఆరాట పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాయి. ఆన్‌లైన్‌లోనే సీట్లు కేటాయించి ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రులకు కాలేజీల నుంచి ఫోన్లు వస్తున్నాయి. నగదు చెల్లించి పుస్తకాలు కొనుగోలు చేయాలని చెబుతున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తున్నాము ఫీజులు చెల్లించాలని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు పుస్తకాల ధరలు బాగా పెంచాయి. 

భారమైన కుటుంబ పోషణ

కరోనా నేపథ్యంలో కుటుంబపోషణ ఖర్చు కూడా బాగా పెరిగింది. పెట్రోల్‌, డీజిల్‌ నిత్యావసరలు, మం దుల ధరలు పెరిగి జీవన వ్యయం 30శాతంకు పైగా పెరిగింది. మాస్కులు, శానిటైజర్ల కొనుగోలు తప్పనిసరిగా మారింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పోషకాహారం కొనుగోలుకు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. కొన్ని కుటుంబాల వారికి కుటుంబ పోషణే కష్టంగా మారింది. మరోవైపు అప్పుల బాధలు ఇబ్బంది పెడుతున్నాయి. 

అందిన కాడికి అప్పులు

పిల్లలకు ఫీజులు, పుస్తకాల కొనుగోలుకు ప్రస్తుతం రూ.10వేలు కావలసి వస్తుంది. ఇంజనీరింగ్‌, ఇతర విద్యలకు అధికంగా ఖర్చు అవుతుంది. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావడానికి సెల్‌ఫోన్లు, లాప్‌టా్‌పలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు బం గారు తాకట్టు, రుణాల ద్వారా నగ దు సమకూర్చు కుంటున్నారు. బయట అప్పులు తెచ్చు కుంటున్నారు. నగదు దొరకని పెద్దలు ఆందోళన చెం దుతున్నారు. రుణాలు తీసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరు గతంలో బ్యాంక్‌లు, ప్రైవే టు ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పుల తాలూ కూ ఈఎంఐలు చెల్లించడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా అప్పు ఎక్కడి నుంచి తేవాలో మదన పడుతున్నారు. 


Updated Date - 2021-06-24T04:38:59+05:30 IST