Abn logo
Sep 20 2020 @ 14:54PM

అక్కినేనిని స్మరించుకున్న చంద్రబాబు

Kaakateeya

ఆదివారం(సెప్టెంబర్‌ 20) నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా యావత్ తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్‌ వేదికగా ఎ.ఎన్‌.ఆర్‌నుస్మరించుకున్నారు. "తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు నిలిచారు. సినిమాల పరంగానే కాదు విశిష్టమైన వ్యక్తిత్వాలు, కృషి, పట్టుదల, క్రమశిక్షణలతో ఆ ఇద్దరు కోట్లాది మందికి ఆదర్శనీయులయ్యారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుగారి జయంతి సందర్భంగా ఆ మహానటుని కళాసేవను స్మరించుకుందాం" అంటూ ట్వీట్‌ చేశారు నారా చంద్రబాబునాయుడు. 



Advertisement
Advertisement
Advertisement