Advertisement
Advertisement
Abn logo
Advertisement

బురఖాలో వచ్చి.. పెద్దమ్మ ఇంటికే కన్నం

  • బురఖాలో వచ్చింది భార్యాభర్తలు
  • అప్పులు తీర్చేందుకు పథకం
  • సీసీ కెమెరాలకు చిక్కి కటకటాల పాలు
  • వీడిన వృద్ధురాలి ఇంట్లో చోరీ మిస్టరీ

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌ : రంజాన్‌ ఇఫ్తార్‌ కోసం పండ్లను పంపిణీ చేస్తున్నామంటూ ఓ వృద్ధురాలికి మస్కా కొట్టి నగదు, బంగారు ఆభరణాలను చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బురఖాలో వచ్చిన ఇద్దరు మహిళలు కాదని, భార్యాభర్తలని తేల్చరు. సొంత పెద్దమ్మ ఇంటికే కన్నం వేసేందుకు బురఖా ధరించి వచ్చి, చివరికి సీసీ కెమెరాలకు చిక్కా రు. చాదర్‌ఘాట్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ కథనం ప్రకారం.. ఆజంపూరకు చెందిన అక్బర్‌(43), సయిదా ఇదాయత్‌ (32) భార్యాభర్తలు. ఆర్థిక సమస్యలతో అప్పు చేశారు. సొంత పెద్దమ్మ ఇంటికి తరచూ వెళ్లే అక్బర్‌ ఆమె ఇంట్లో విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. ఆమె ఇంట్లో రూ.2 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించాడు.

భార్య సయీదా ఇదాయత్‌తో కలిసి చోరీకి పథకం వేశారు. ఇద్దరూ కలిసి బురఖా ధరించారు. ఇఫ్తార్‌ సమయంలో పండ్లు పంపిణీ చేస్తున్నామంటూ పెద్దమ్మ వికారున్సీసా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లారు. ఆమెకు పండ్లు ఇస్తున్నట్లు నటించి కత్తితో బెదిరించి, నిర్బంధించారు. ఇంట్లోని రూ.2 లక్షల నగదు తో పాటు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొ ని పారిపోయారు.  కొద్దిదూరం నడుచుకుంటూ వెళ్లి, అద్దె ఆటోలో ఆజంపురలోని ఇంటికి చేరుకున్నారు. వికారున్సీసా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన చాదర్‌ఘాట్‌ పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. వికారున్సీసా సోదరి కు మారుడు, అతని భార్య ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చాదర్‌ఘాట్‌ క్రైం పోలీసులు వారిని పట్టుకుని విచారించగా, నేరం అంగీకరించారని ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ తెలిపారు. నిందితుల నుంచి రూ. 1.70 లక్షల నగదు, తులం బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపించారు. 12 గంటల్లోనే కేసును చేధించిన చాదర్‌ఘాట్‌ క్రైం పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసించారు.

Advertisement
Advertisement