Abn logo
Feb 27 2021 @ 22:10PM

కెలికిచూడు తెలిసిపోద్ది అసలు యవ్వారం.. అంటోన్న అనసూయ

అనసూయ ఏంటి ఇలా మాట్లాడటం ఏంటి అని ఆశ్చర్యపోతారేమో.. దాదాపు సోషల్‌ మీడియాలో తింగరేశాలు వేసే నెటిజన్లతో దాదాపు ఆమె ఇలాంటి లాంగ్వేజ్‌లోనే సమాధానం ఇస్తుంటుంది. అయితే ఇప్పుడు మాత్రం ఆమె అలా అనేది.. ఓ సాంగ్‌లో. మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో.. బన్నీ వాసు నిర్మాతగా కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నటించారు. ఈ చిత్రంలో యాంకర్‌ అనసూయ ఐటమ్‌ సాంగ్‌ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఐటమ్‌ సాంగ్‌కి సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. 

'పైన ప‌టారం లోన లొటారం' అంటూ సాగే ఈ మాస్ ఐట‌మ్ సాంగ్ ప్రోమో ఇప్పుడు సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. ఫుల్‌ సాంగ్‌ను మార్చి 1న 4 గంట‌ల 5 నిమ‌షాల‌కి విడుద‌ల చేస్తున్న‌ట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటిస్తూ.. తాజాగా సాంగ్ ప్రోమోని విడుదల చేసింది. కార్తికేయ - అన‌సూయ మాస్ స్టెప్పుల‌తో అదిరిపోయేలా ఈ పాట రూపొందినట్లుగా ఈ ప్రోమో చెప్పేస్తుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ.. ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్‌కు అనూహ్య స్పంద‌న వచ్చింది. ఇప్పుడు మాస్ అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే రాబోతున్న పైన ప‌టారం లోన లొటారం పాట‌ను సిద్ధం చేశాం.. అని తెలిపారు. ఈ చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement