Abn logo
Mar 5 2021 @ 18:13PM

‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ ట్రైలర్‌: ప్రేక్షకులకి మంచి ఆప్షన్‌

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో.. విజయవంతమైన చిత్రాల నిర్మాతగా పేరున్న ‌బన్నీ వాసు నిర్మాత‌గా.. ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, క్యూట్‌ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీది మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 19న విడుదల కాబోతోన్న నేపథ్యంలో చిత్రయూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ‌ తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో.. అద్భుతమైన ఎమోషన్స్‌తో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి.. అలాగే లావణ్య త్రిపాఠి గెటప్‌.. సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి.

"ఆకలి నిద్ర మూర్ఖత్వం ఇవి కాకుండా.. జాలి దయ మానవత్వం అంటే ఏంటో తెలుసారా నీ మనస్సాక్షికి.. "

"అమ్మాయిలందరూ ఎదవలకే పడతారంటారు.. అందులో నేను నెంబర్ వన్.. నన్ను మించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది నీకు.."

" ఇందాక ఫోన్‌లో చూసావే.. నాది యాక్టింగ్ మాత్రమే.. నువ్వు ఎక్కువ చేసావ్ అనుకో.. నీకు ఒరిజినల్ పడిపోద్ది.." అనే డైలాగ్‌లో ఈ ట్రైలర్‌ను కట్‌ చేశారు. ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా.. సినిమాపై ఇంట్రస్ట్‌ని, అంచనాలను పెంచేస్తుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించే మెటీరియల్‌ ఈ చిత్రంలో ఉన్నట్లుగా ట్రైలర్‌ హింట్‌ ఇచ్చేసింది. ఇక విడుదల తర్వాత ఈ చిత్రం ఏ రేంజ్‌ హిట్‌ అందుకుంటుందో తెలియాలంటే.. మార్చి 19 వరకు వెయిట్‌ చేయక తప్పదు. 

Advertisement
Advertisement
Advertisement