Abn logo
Feb 23 2021 @ 20:55PM

‘చావు కబురు చల్లగా’లోని ‘కదిలే కాలాన్నడిగా‌’ సాంగ్‌ వదిలారు

'భలే భలే మగాడివోయ్', 'గీతా గోవిందం' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై 'ఆర్.ఎక్స్ 100' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'చావు కబురు చల్లగా'. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర యూనిట్ తాజాగా 'కదిలే కాలాన్నడిగా' అని సాగే సాంగ్‌ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. పాట విడుదల అనంతరం నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ''కథ పరంగా మంచి సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో కౌశిక్ చెప్పిన కథ నచ్చి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఫ్రెష్ కంటెంట్‌తో కౌశిక్ చెప్పిన ఈ పాయింట్ మిస్ అవ్వకూడదని ఈ సినిమా చేశాను. ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూసిన తరువాత చాలా హ్యాపీగా అనిపించింది. అనుకున్నది అనుకున్నట్లుగా డైరెక్టర్ సినిమా తీశారు. కార్తికేయ, లావణ్య ఇద్దరూ ఈ కథకు పూర్తి న్యాయం చేశారు. యంగ్ టీమ్ చేసిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. మార్చి 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము.." అని తెలిపారు.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. గీతా ఆర్ట్స్ లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థాంక్స్ టు బన్నీ వాసు గారు. ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి, అందరూ కనెక్ట్ అవుతారు.. అని తెలుపగా.. హీరో కార్తికేయ మాట్లాడుతూ.. చాలా గ్యాప్ తర్వాత ఇలా మీడియాతో మాట్లాడడం సంతోషంగా ఉంది. ఈ సినిమా గురించి అందరూ బాగా మాట్లాడుకుంటున్నారు. ఒక పాజిటీవ్ వైబ్రేషన్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ కథకు నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు బన్నీ వాసు గారికి ధన్యవాదాలు. షూటింగ్ సమయంలో అల్లు అరవింద్‌గారు బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ చెప్పింది నేను చేశాను, తను క్లారిటీతో సినిమా తీసాడు. ఒక మంచి సినిమాలో నటించానన్న సంతృప్తి ఉందని తెలిపారు.


డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు తగ్గట్లు చావు కబురు చల్లగా అనే టైటిల్‌ను లాక్ చేయడం జరిగింది. హీరో డెడ్ బాడీస్‌ను పికప్ చేసుకొనే వెహికల్ డ్రైవర్‌గా, హీరోయిన్ నర్స్ గా కనిపిస్తుంది. ఇదొక లవ్ స్టొరీ, సీరియస్ పాయింట్ ను ఎంటర్‌టైన్‌ వేలో చెప్పడం జరిగింది. సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి. ఆడియన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయని తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement