సీజీఎస్‌టీ నూతన వెబ్‌సైట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-06T05:08:15+05:30 IST

సీజీఎస్‌టీ చెల్లింపుల కోసం నూతనంగా ప్రారంభించిన వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీజీఎస్‌టీ గుంటూరు ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఫహీమ్‌ అహ్మద్‌ కోరారు.

సీజీఎస్‌టీ నూతన వెబ్‌సైట్‌ ప్రారంభం
వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న సీజీఎస్‌టీ గుంటూరు ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఫహీమ్‌ అహ్మద్‌, ఏసీ విల్సన్‌బాబు తదితరులు

గుంటూరు, ఆగస్టు 5: సీజీఎస్‌టీ చెల్లింపుల కోసం నూతనంగా ప్రారంభించిన వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీజీఎస్‌టీ గుంటూరు ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఫహీమ్‌ అహ్మద్‌ కోరారు. గుంటూరు కన్నావారితోటలోనున్న సీజీఎస్‌టీ గుంటూరు కమిషనరేట్‌ కార్యాలయంలో  వెబ్‌సైట్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరు కమిషనరేట్‌ పరిధిలోని సీజీఎస్‌టీ పన్ను చెల్లింపుదారులు అధికారిక సమాచారం కోసం సీజీఎస్‌టీజీయూఎన్‌టీయూఆర్‌.జీవోవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్‌ఐసీ రాష్ట్ర ఉన్నతాధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మా ఎన్‌ఐసీ సహకారంతో దేశంలోని పలు సీజీఎస్‌టీ కమిషరేట్‌లలో వెబ్‌సైట్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు.  కార్యక్రమంలో కస్టమ్స్‌ అడిషనల్‌ కమిషనర్‌ సాధు నరసింహారెడ్డి, ఎన్‌ఐసీ అధికారులు ఆర్‌.శివకుమార్‌, ఎంజీ చంద్రశేఖర్‌, జీఎస్‌టీ జాయింట్‌ కమిషనర్‌లు జి.రామకృష్ణరాజుయాదవ్‌, లక్ష్మీనారాయణ, ఉపేంద్రకుమార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ చుక్కా విల్సన్‌బాబు, సూపరింటెండెంట్లు గాదె శ్రీనివాసరెడ్డి, గుమ్మడి సీతారామయ్య చౌదరి తదితరులున్నారు. 


Updated Date - 2022-08-06T05:08:15+05:30 IST