చెర్వుగట్టు, మట్టపల్లిలో దర్శనాల నిలిపివేత

ABN , First Publish Date - 2021-05-08T06:30:38+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో నల్లగొండ జిల్లా చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 9 నుంచి 18 వరకు భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేయాలని ట్రస్ట్‌ బోర్డు తీర్మానించింది. చైర్మ న్‌ మేకల అరుణారాజిరెడ్డ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

చెర్వుగట్టు, మట్టపల్లిలో దర్శనాల నిలిపివేత
ఆలయాన్ని మూసివేసి శానిటైజ్‌ చేస్తున్న సిబ్బంది

నార్కట్‌పల్లి, మఠంపల్లి: కొవిడ్‌ నేపథ్యంలో నల్లగొండ జిల్లా చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 9 నుంచి 18 వరకు భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేయాలని ట్రస్ట్‌ బోర్డు తీర్మానించింది. చైర్మ న్‌ మేకల అరుణారాజిరెడ్డ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామివారి నిత్య విధి కైంకర్యాలు ఆంతర్యంగా నిర్వహించనున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనృసింహుడి ఆలయంలో సైతం మూడు రోజులపా టు భక్తులకు దర్శనాలను నిలిపివేయనున్నారు. శుక్రవారం నుంచే ఇది అమలులోకి రాగా, ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగనుంది. దేవాలయంలో పని చేస్తున్న ఒకరికి పాజిటివ్‌ రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2021-05-08T06:30:38+05:30 IST