సెస్‌, సర్‌చార్జీలతో రెట్టింపు ఆదాయం

ABN , First Publish Date - 2021-03-03T07:28:15+05:30 IST

సెస్‌, సర్‌చార్జీల రూపంలో ఎడాపెడా జరుపుతున్న బాదుడుతో కేంద్రానికి లభించే స్థూల పన్ను ఆదాయంలో వీటి వాటా గడిచిన పదేళ్లలో దాదాపు రెట్టింపైంది. 2011-12లో కేంద్రానికి పన్నుల ద్వారా సమకూరిన ఆదాయంలో సెస్‌లు

సెస్‌, సర్‌చార్జీలతో రెట్టింపు ఆదాయం

పదేళ్లలో కేంద్రానికి పెరిగిన రాబడి.. దక్షిణాదికి తగ్గిన పన్నుల వాటా


న్యూఢిల్లీ, మార్చి 2: సెస్‌, సర్‌చార్జీల రూపంలో ఎడాపెడా జరుపుతున్న బాదుడుతో కేంద్రానికి లభించే స్థూల పన్ను ఆదాయంలో వీటి వాటా గడిచిన పదేళ్లలో దాదాపు రెట్టింపైంది. 2011-12లో కేంద్రానికి పన్నుల ద్వారా సమకూరిన ఆదాయంలో సెస్‌లు, సర్‌చార్జీల వాటా 10.4 శాతంగా ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో అది 19.9 శాతానికి చేరుకుంది. ఇండియా రేటింగ్స్‌ సంస్థ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో.. రాష్ట్రాలకు కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గుతూ.. గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆ సంస్థ ముఖ్య ఆర్థిక వేత్త సునీల్‌కుమార్‌ సిన్హా విశ్లేషించారు. రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో కేంద్రం రూ.1.8 లక్షల కోట్లను విడుదల చేసే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవా ల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల వల్ల 8 రాష్ట్రాలకు పన్నుల వాటా తగ్గిం ది. మరికొన్ని రాష్ట్రాలకు దక్కాల్సిన వాటా పెరిగింది. 


పన్నుల వాటా తగ్గడంలో ఆ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై అధికంగా ఉంది. కర్ణాటకకు 3.64ు వాటా దక్కనుం ది. కేరళకు 1.93ు, ఆంధ్రప్రదేశ్‌కు 4.05ు, తెలంగాణకు 2.10ు మాత్రమే అంద నుంది. పన్నుల వాటా పెరిగే రాష్ట్రాల్లో మహారాష్ట్ర(6.32ు) ముందుంది. ఆ తర్వాతి వరసలో.. రాజస్థాన్‌(6.03ు), గుజరాత్‌(3.48ు) ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం సిఫారసులు కొవిడ్‌-19కి ముందు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించినవని, కరోనా కల్లోలం తర్వాత రాష్ట్రాలు, కేంద్రం ఆదాయం పడిపోయిందని సునీల్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42ుగా ఉండగా.. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం వల్ల ఇప్పుడు అది 41శాతానికి తగ్గిందన్నారు. పన్నుల వాటాతోపాటు.. ఆర్థిక సంఘం సూచించని ఇతరత్రా నిధులను కలుపుకొని 2011-12లో రాష్ట్రాలకు 53.4ు మేర పంపిణీ జరగ్గా.. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 48.6 శాతానికి తగ్గిందని సిన్హా వెల్లడించారు.

Updated Date - 2021-03-03T07:28:15+05:30 IST