చెప్పిందేంటి.. మీరు చేసేదేంటి ?

ABN , First Publish Date - 2022-05-18T03:31:20+05:30 IST

‘నేను చెప్పిందేంటి... మీరు చేసేది ఏంటి...? తెలివి లేదా’... అంటూ సోమశిల ఇంజనీర్లపై సీఈ హరినారాయణరెడ్డి మండిప

చెప్పిందేంటి.. మీరు చేసేదేంటి ?
పనులు పరిశీలిస్తున్న సీఈ హరినారాయణరెడ్డి

సోమశిల ఇంజనీర ్లపై సీఈ ఆగ్రహం

ఆఫ్రాన్‌ పనుల తీరుపై అసహనం

అనంతసాగరం, మే 17: ‘నేను చెప్పిందేంటి... మీరు చేసేది ఏంటి...? తెలివి లేదా’... అంటూ సోమశిల ఇంజనీర్లపై సీఈ హరినారాయణరెడ్డి మండిపడ్డారు. సోమశిల జలాశయం వద్ద జరుగుతున్న పనులను  మంగళవారం ఆయన ఎస్‌ఈ వెంకటరామిరెడ్డితో కలసి పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. వరదలకు దెబ్బతిన్న  డ్యాం ముందు ఆఫ్రాన్‌, డైన్‌స్టీమ్‌ కట్టడాలు, రిటర్నింగ్‌ వాల్స్‌ పనులు ప్రారంభం కాగా, ప్రాధాన్యత క్రమంలో పనులు చేసేలా ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిం చారు. వారి సూచన ప్రకారం తొలుత  11, 12 క్రస్ట్‌గేట్లు నీరు తరలించే  స్లూయిజ్‌ ప్రాంతాన్ని యథాస్ధితికి తెచ్చేలా పనులు చేయాల్సి ఉండగా, స్థానిక ఇంజనీర్లు ఆఫ్రాన్‌లో ఇతర పనులు చేయిస్తుండగా సీఈ ఆగ్రహం చెందారు. తాము సూచించిన పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేయా లని సీఈ ఆదేశించారు. అనంతరం సీఈ విలేకర్లతో మాట్లాడుతూ వచ్చే ఏడాదికి పనులు పూర్తి చేసి కట్టడాలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ ధనుంజయ్య, డీఈలు, జేఈలు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T03:31:20+05:30 IST