Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఈవోను కలిసిన టీఆర్ఎస్ నేతలు...జగ్గారెడ్డిపై ఫిర్యాదు

హైదరాబాద్: సీఈఓ శశాంక్ గోయల్‌ని టీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ రెడ్డి, భరత్ శుక్రవారం ఉదయం బుద్ధభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ప్రలోభ పెడుతున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే నజరానా అంటూ ఓటర్లకు జగ్గారెడ్డి ఫోన్లు చేసారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 


టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయని, కొన్ని పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. గెలుపే లక్ష్యంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 


భరత్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఓట్లకు ముందు 50వేలు, ఓట్ల తర్వాత రెండు లక్షలు ఇచ్చేట్టు పేయిడ్ న్యూస్ వేయిస్తున్నాయని అన్నారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ పేపర్ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత నీచమైన రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందన్నారు. ఇది కచ్చితంగా నేరమే అని...చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరినట్లు తెలిపారు. ఆయన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు. 

Advertisement
Advertisement