Meenakshi lekhi: వాళ్లు రైతులు కాదు.. గూండాలు అనండి

ABN , First Publish Date - 2021-07-23T01:39:20+05:30 IST

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖీ సంచలన వ్యాఖ్యలు చేశారు

Meenakshi lekhi: వాళ్లు రైతులు కాదు.. గూండాలు అనండి

న్యూఢిల్లీ : సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా గూండాలు (మవాలీలు) అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘‘వారిని రైతులని పిలవకండి.. వారంతా మవాలీలు. జనవరి 26 న ఏం జరిగిందో దేశం మొత్తానికీ తెలుసు. జనవరి 26 న జరిగిన సంఘటనకు నేరస్థులు కూడా సిగ్గుపడతారు. అదంతా నేరపూరిత చర్యే. ఇలాంటి కార్యకలాపాలను ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నాయి’’ అంటూ మీనాక్షి లేఖీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

స్పందించిన రాకేశ్ టికాయత్

కేంద్రమంత్రి మీనాక్షీ లేఖీ వ్యాఖ్యలపై రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ స్పందించారు. తాము గూండాలము కామని, రైతులమని పేర్కొన్నారు. రైతులనుద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని, తాము అన్నదాతలమని రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-23T01:39:20+05:30 IST