నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేయనున్న కేంద్రం...

ABN , First Publish Date - 2020-10-01T22:30:41+05:30 IST

యార్ధంలో దాిదాసే రూ. 4.34 లక్షల కోట్ల మేరకు రుణాలకు వెళ్ళనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 12 లక్షల కోట్ల రుణం... లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ ఈ వివరాలను వెల్లడంచారు. సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్థంలో కేంద్రం... రూ. 7.66 లక్షల కోట్ల రుణాలను తీసుకుంది.

నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేయనున్న కేంద్రం...

న్యూఢిల్లీ : కేంద్రం భారీ రుణానికి వెళ్ళనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయార్ధంలో దాదాపు రూ. 4.34 లక్షల కోట్ల మేరకు రుణాలకు వెళ్ళనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 12 లక్షల కోట్ల రుణం... లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ ఈ వివరాలను వెల్లడంచారు. సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్థంలో కేంద్రం... రూ. 7.66 లక్షల కోట్ల రుణాలను తీసుకుంది.


ప్రథమార్థంలో రూ. 6.98 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా... రుణాలు ... ఇప్పటికే... 7.50 లక్షల కోట్లు దాటిపోయాయి. మార్కెట్ నుండి రూ. 12 లక్షల కోట్ల రుణాలను తీసుకుంటామని ‘మే’ లో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 


ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సందర్భంగా... ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 7.80 లక్షల కోట్ల మార్కెట్ రుణాలను తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా... కరోనా నేపధ్యంలో... దీనిని 50 శాతం పెంచి రూ. 12 లక్షల కోట్లకు పెంచాల్సి వచ్చింది. కాగా... ఆగస్టు చివరి నాటికి ఆర్థిక ద్రవ్యలోటు రూ. 8.70 లక్షల కోట్లుగా ఉంది. పూర్తి ఏడాదికి బడ్జెట్‌లో అందించిన రూ. 7.96 లక్షల కోట్ల కంటే ఇది 9.3 శాతం ఎక్కువ. మొత్తంమీద ఈ ఆర్ధిక సంవత్సరంలో... ద్రవ్యలోటు రూ. 14 లక్షల కోట్ల నుండి రూ. 18 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చునని ఆర్ధిక రంగ నిపుణులు భావిస్తున్నారు.  జూన్ లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి ఆదాయంలో మెరుగుదల క్రమేపీ కనిపిస్తోందని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే... ఓ వైపు ప్రభుత్వానికి ఆదాయం లేకపోగా, మరోవైపు రుణ లక్ష్యం రూ. 12 లక్షల కోట్లుగా ఉన్నట్లు సమాచారం. రుణాల్లో మార్పు లేదని ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం...  ప్రస్తుతానికి  భారీ ఉద్దీపనకు ముందుకు వెళ్లకపోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే... ఆర్థిక మద్దతు కోసం... భారీ ప్యాకేజీ కాకపోయినా... ఎంతోకొంత ప్యాకేజీ రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 


ఇక... రెండో అర్ధ సంవత్సరంలో కేంద్రం... రూ. 4.34 లక్షల కోట్ల మేర రుణాలను తీసుకోనుంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.2.1 లక్షల కోట్లుగా పెట్టుకుంది. అయితే... కరోనా నేపథ్యంలో ఇది వెనుకబడింది.


భారీగా తగ్గిన ఆదాయం... కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం భారీగానే తగ్గింది. ఆదాయాల్లో కొరత నేపథ్యంలో  వరుసగా రెండో నెల(ఆగస్టులో) కూడా ద్రవ్యలోటు పెరిగింది. ఏప్రిల్-ఆగస్ట్ నెలలమధ్య కాలంలో ద్రవ్యలోటు వార్షిక లక్ష్యంలో 109.3 శాతం ఉండడం గమనార్హం. గతేడాది మొత్తం మీద ద్రవ్యలోటు ఏడేళ్ల గరిష్ఠస్థాయికి(4.6 శాతం)కి నమోదైంది. కరెంట్ ఖాతా మిగులు జూన్ క్వార్టర్‌లో జీడీపీలో 3.9 శాతానికి పెరిగి 1,980 కోట్ల డాలర్ల(రూ. 1.49 లక్షల కోట్లు)కు చేరుకుంది. మొత్తంమీద ఆర్ధికంగా పరిస్థితి క్షీణదశకు చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో... భారీ రుణాలకు వెళ్ళాల్సిన పరిస్థితి కేంద్రానికి ఎదురైందని చెబుతున్నారు. 

Updated Date - 2020-10-01T22:30:41+05:30 IST