పెన్షన్‌ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐ!

ABN , First Publish Date - 2021-04-12T05:54:39+05:30 IST

పెన్షన్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచుతూ ప్రభుత్వం రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రతిపాదించే ఆస్కారం కనిపిస్తోంది...

పెన్షన్‌ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐ!

  • త్వరలో బిల్లు


న్యూఢిల్లీ: పెన్షన్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచుతూ ప్రభుత్వం రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రతిపాదించే ఆస్కారం కనిపిస్తోంది. గత నెలలో జరిగిన సమావేశాల్లో బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 74 శాతానికి పెంచే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఇందుకోసం బీమా చట్టం 1938 సవరించింది. ఇంతకు ముందు 2015లో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచడంతో గత ఐదేళ్ల కాలంలో బీమా రంగంలోకి రూ.26,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. అదే విధంగా పెన్షన్‌ రంగంలో కూడా ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ పిఎ్‌ఫఆర్‌డీఏ చట్టం 2013కి సవరణ ప్రతిపాదించే ఆస్కారం ఉన్నట్టు అభిజ్ఞ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎన్‌పీఎస్‌ ట్రస్టును పీఎ్‌ఫఆర్‌డీఏ నుంచి వేరు చేసే అవకాశం కూడా ఉన్నదంటున్నారు. గతంలోని డిఫైన్డ్‌ పెన్షన్‌ వ్యవస్థ స్థానంలో ఎన్‌పీఎ్‌సను (జాతీయ పెన్షన్‌ స్కీమ్‌) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2004 జనవరి ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ సర్వీసుల్లో కొత్తగా చేరే వారందరూ ఎన్‌పీఎ్‌సను తీసుకోవడం తప్పనిసరి చేశారు. తదుపరి 2009 మే ఒకటో తేదీ నుంచి స్వచ్ఛందంగా చేరే ప్రాతిపదికన ఎన్‌పీఎ్‌సను జనాభా అందరికీ విస్తరించారు. 


Updated Date - 2021-04-12T05:54:39+05:30 IST