మెడికల్ ఆక్సిజన్‌‌ కొరత లేకుండా కేంద్రం చర్యలు

ABN , First Publish Date - 2020-04-11T00:31:15+05:30 IST

కరోనా వైరస్‌తో పారాటానికి అవసరమైన మెడికల్ ఆక్సిజన్ కొరతను పలు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం..

మెడికల్ ఆక్సిజన్‌‌ కొరత లేకుండా కేంద్రం చర్యలు

తిరువనంతపురం: కరోనా వైరస్‌తో పారాటానికి అవసరమైన మెడికల్ ఆక్సిజన్ కొరతను పలు ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. మెడికల్ ఆక్సిజన్ కొరత ఏమాత్రం లేకుండా చూసేందుకు, పుష్కలంగా మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మెడికల్ ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక పర్యవేక్షణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్టు పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పీఈఎస్ఓ) డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ డాక్టర్ ఆర్.వేణుగోపాల్ తెలిపారు.


'దేశ అవసరాలకు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసేందుకు వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డీపీఐఐటీ ఇప్పటికే ఒక పర్యవేక్షణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాల వారీ అవసరాలను ఆల్ ఇండియా ఇండస్ట్రీ గ్యాస్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఏఐఐజీఎంఏ) పర్యవేక్షిస్తోంది' అని డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. కేరళలో 2,212 సిలెండర్లు నింపి, రోజువారీ వివిధ ఆసుపత్రులకు 2,086 సిలెండర్లు సరఫరా చేస్తున్నామని అన్నారు. మెడికల్ ఆక్సిజన్ల నిరంతర ఉత్పత్తి జరుగుతోందని, పూర్తి సన్నద్ధతతో ఉన్నామని సదరన్ గ్యాస్ లిమిటెడ్ మేనేజర్ వినోద్ కుమార్ తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత కూడా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తయారీ ఉండదని, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని వినోద్ కుమార్ వెల్లడించారు.

Updated Date - 2020-04-11T00:31:15+05:30 IST